మార్కులు తక్కువ వేసి తమను పరీక్షలలో తప్పేట్లు చేశారన్న కోపంతో విద్యార్థులు అధ్యాపకుడిని చెట్టుకు కట్టేసి కొ్ట్టిన ఘటన జార్ఖండ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది, మార్కులు సరిగ్గా రాకపోతే విద్యార్థులు మళ్లీ మళ్లి చదివి.. చివరకు కంఠస్థం పటైనా సరే పాఠాలను నేర్చుకుని మరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ గురువుల పట్ల మర్యాద, భక్తిభావం సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో మార్కులు తక్కువగా ఎందుకు వేశారని ఏకంగా అధ్యాపకులనే పట్టకుని.. దోంగను బంధించినట్లు చెట్టుకు కట్టేసి కోట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. మాస్టారుతో పాటు అతనికి అండగా నిలిచే పాఠశాల క్లర్క్, అటెండర్లను కూడా కట్టేశారు.
గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః అన్న సూక్తులను అనుసరించి.. గురువులను పూజించే రోజులు కనుమరుగు అవుతున్నాయి. గురువు సాక్ష్యాత్ దేవుడితో సమానమని చెబుతుంటే.. జార్ఖండ్ రాష్ట్రంలోని విద్యార్థులు ఏకంగా గురువులనే చెట్టుకు కట్టేసి కోట్టేస్తున్నారు. ఏదో చేయకూడని పని చేశారని గురువులను చెట్టుకు కట్టేస్తే పర్వాలేదు కానీ.. మార్కులు తక్కువగా వేశారని ఏకంగా జార్ఖండ్ లో గణితశాస్త్ర అధ్యాపకుడిని, అతడితో పాటు స్కూల్ క్లర్క్‌ను స్కూల్ ఆవరణలోని చెట్టుకు కట్టేసి కొట్టారు.
ఈ ఘటన పాఠశాల ఆవరణలోనే చోటుచేసుకోవడం కొసమెరుపు. ఇక ఈ దారుణానికి పాల్పడిన ఘటనలో పాఠశాలలోని మెజారిటీ విద్యార్థులు పాల్గొనడం విశేషం. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఉన్న గోపికందార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ చేశారన్న కోపంతో ఆ సబ్జెక్ట్ టీచర్ సుమన్ కుమార్‌ను, ఆ మార్క్స్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన స్కూల్ క్లర్క్ సోనేరామ్ను స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టుకు కట్టి దారుణంగా కొట్టారు. అయితే, ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం కానీ, బాధిత టీచర్, క్లర్క్ కానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ నిర్వహించిన పరీక్షలో .. మ్యాథ్య్ సబ్జెక్టులో ఈ పాఠశాలలోని 9వ తరగతిలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 11 మందికి `డీడీ` గ్రేడ్ వచ్చింది. ఈ డబుల్ డీ గ్రేడ్ అంటే ఫెయిల్ అనే అర్థం. దాంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు గణితం టీచర్‌పై ఇలా దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ ఘటనపై ఆరా తీయడానికి వెళ్లిన పోలీసులకు స్కూల్ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఫిర్యాదు చేస్తే.. ఆ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులకు వివరించింది. బాధిత టీచర్, క్లర్క్ కూడా ఫిర్యాదు ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ ఘటన అనంతరం బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనంత్ ఝా స్కూల్‌కు వెళ్లి కారణాలను ఆరా తీశారు. ఆ తరువాత, పాఠశాలలోని 9, 10వ తరగతి విద్యార్థులకు వారం పాటు సెలవులు ఇచ్చి ఇళ్లకు పంపించేశారు. విద్యార్థులు కొట్టిన బాధిత టీచర్ సుమన్ కుమార్ గతంలో అదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ తరువాత ఇతర టీచర్ల ఫిర్యాదు మేరకు ఆయనను ఆ హోదా నుంచి తొలగించారు. అందువల్ల ఈ ఘటన వెనుక ఆ స్కూల్లోని టీచర్ల మధ్య ఉన్న విబేధాలు, ఇతర రాజకీయాలు కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more