ప్రజలకు శాంతిభద్రతలను అందించాల్సిన పోలీసులే ఏదో చిన్న విషయమై వారిలో వారే కొట్టుకునే ఘటనలు అప్పడప్పుడు మనకు కనబడుతుంటాయి. ఎవరైనా కొట్టుకుంటుంటే వారిని అపి.. సముదాయించి ఇళ్లకు పంపించాల్సిన పోలీసులు వారిలో వారే తన్నుకు చస్తుంటే.. వారిని విడిపించడానికి అక్కడే ఉన్న మరో పోలీసు తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయ్యింది. ఇక పోలీసులే వారిలో వారు తన్నకోవడం.. పోట్లాడుకోవడం చూసిన స్థానికులు నివ్వెరపోయి.. తమ చేతుల్లోని స్మార్ట్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించేందుకు పోటీపడ్డారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసులు తమ జీపును రోడ్డుపై నిలిపి మరీ నడిరోడ్డుపైనే కుమ్మేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ జలాన్లోని జగమ్మన్పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హోంగార్డు, కానిస్టేబుల్ నడిరోడ్డు మీదే కుమ్మేసుకున్నారు. మద్యం విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణమని తెలుస్తోంది. తొలుత ఇద్దరి మధ్య ప్రారంభమైన వాగ్వివాదం కాస్తా ముదిరి కొట్లాటకు దారి తీసింది. దీంతో చెలరేగిపోయిన కానిస్టేబుల్.. హోంగార్డుపై ముష్టిఘాతాలు కురిపించాడు. కాళ్లతో తంతూ చెలరేగిపోయాడు.
ఈ క్రమంలో ఇద్దరూ రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పడ్డారు. కిందపడ్డాక హోంగార్డుపై కానిస్టేబుల్ మరింతగా చెలరేగిపోయాడు. ఆగకుండా పిడిగుద్దులు కురిపించాడు. మరో కానిస్టేబుల్ వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు గంటపాటు వారిద్దరి మధ్య ఫైట్ జరిగింది. అలా పట్టపగలు నడిరోడ్డుపై వీరిద్దరూ కొట్లాడుకుంటుంటే దారినపోయే వారు వాహనాలు ఆపి మరీ చూస్తుండిపోయారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అది కాస్తా పోలీసు పెద్దల దృష్టికి చేరడంతో ఇద్దరినీ విచారించారు. అనంతరం కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.
माफ कीजियेगा आप रील लाइफ नहीं रियाल लाइफ देख रहे हैं...
— Tahir Journalist (@tahir_journalst) September 5, 2022
UP: जालौन में खाकी हुई शर्मसार, नशे में धुत सिपाही ने होमगार्ड पर जमकर बरसाए लात-घूंसे
वीडियो वायरल होने के बाद SP रवि कुमार ने किया लाइन हाजिर...@tahir_journalst pic.twitter.com/7NeXNnRDIQ
थाना रामपुरा क्षेत्र में आरक्षी व हो0गा0 के बीच हुई मारपीट के सम्बन्ध में पुलिस अधीक्षक जालौन @Ravi_KumarIPS द्वारा दी गई बाइट। pic.twitter.com/PGHw3UFe2E
— JALAUN POLICE (@jalaunpolice) September 5, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more