వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నుంచి కేరళకు మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అందాలను వీక్షించేందుకు ఇప్పటికే ఒక ప్యాకేజీని ప్రకృతి ప్రేమికుల చెంతకు తెచ్చిన ఐఆర్సీటీసీ.. తాజాగా దేవుడి సొంత రాష్ట్రం కేరళలోని అందాలను వీక్షించేందుకు పలు ప్రాంతాలను వీక్షించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్యాకేజీని సరికొత్తగా ఆపరేట్ చేస్తోంది. కేరళను చూడాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ తాజాగా అందుబాటులో ఉంది. కేరళలోని అందాలను చూసి.. తెగ ఎంజాయ్ చేయోచ్చు. హైదరాబాద్ టూ కేరళ వరకూ ఈ ప్యాకేజీ ఉంది. మున్నార్, అలెప్పీలాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. రైలులో తీసుకెళ్లి తీసుకొస్తారు. ఫుడ్, హోటల్, ట్రావెల్స్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో ఉంటాయి. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది. సెప్టెంబర్ 13, 2022న ప్యాకేజీ అందుబాటులో ఉంది.
Day 01 : శబరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:20 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2 : 12:55 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మున్నార్‌కు వెళ్లి.. హోటల్లో చెక్ ఇన్ అవుతారు. మున్నార్ టౌన్లో సాయంత్రం విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి బస చేస్తారు.
Day 3 : ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ అండ్ ఎకో-పాయింట్ సందర్శిస్తారు. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.
Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అలెప్పీకి బయలుదేరుతారు. అలెప్పీలో హోటల్లో చెక్ ఇన్ అవుతారు. బ్యాక్‌వాటర్ అందాలను సాయంత్ర వరకూ ఎంజాయ్ చేయోచ్చు. రాత్రిపూట అలెప్పీలో బస చేస్తారు.
Day 5 : హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. ఎర్నాకులానికి బయలుదేరాలి శబరి ఎక్స్‌ప్రెస్ 11:20 గంటలకు రైల్వే స్టేషన్లో ఉంటుంది.
Day 6 : 12:20 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ. 29830గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.17240 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14300గా ఉంది. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఉంటాయి. స్టాండర్డ్ క్లాసులో అనగా, ఈ పర్యటనలో స్లీపర్ క్లాస్ లో సింగిల్ ఆక్సుపెన్సీకి 27120 ధర నిర్ణయించగా, డబుల్ ఆక్యుపెన్సీకి 14530, త్రిపుల్ ఆక్యుపెన్సీకి 11600 ధరను ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్ని పోందుపర్చి ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more