ఓ చిన్నారి లిప్టులో ఒంటరిగా వెళ్తున్నాడంటే.. అతడ్ని చూసి చూడగానే పక్కనున్నవారు పలకరిస్తారు.. లేదా కనీసం ఓ చిన్న చిరునవ్వు అయినా నవ్వుతారు. ఈ రెండు చేయని వారు ఏదో విషయమై చింతిస్తూ ఉండాలి లేదా.. వారిని మరేదో విషయం బాధిస్తూ ఉండాలి. అయితే ఏ సమస్య లేకపోయినా.. పిల్లలంటే ఏమాత్రం పడని కొందరు సమాజాంలో మనుషులమని తిరుగేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వీరి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. చిన్నారులు ఇలాంటి వారు ఎదురవుతే మాత్రం మీరు తప్పుకుని తిరగండీ. తమ ఇంట్లోని పెంపుడు జంతువులకు ఇచ్చిన విలువ.. సాటి మనుషులకు ఇవ్వడం మాత్రం వీరికి తెలియదు.
అలాంటిదే ఓ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. పెంపుడు కుక్కతో పాటు అపార్టుమెంటు లిప్టులో వెళ్తున్న ఓ వ్యక్తి.. అదే లిప్టులో ఎక్కిన ఓ ఎనమిదేళ్ల చిన్నారిని కరిచింది. అయితే దానిని వారించబోవాల్సిన ఆ యజమాని వేడుకను చూస్తూ కిమ్మనకుండా నిల్చువడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జేబును గుల్ల జేశారు. రూ. 5 వేల జరిమానా విధించింది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చిన ఓ బాలుడు ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లోకి వచ్చింది. కాసేపటికే ఆ కుక్క పిల్ల... బాలుపైకి దూకి అతడిని కరిచింది.
ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఘటన తర్వాత ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క వివరాలను నమోదు చేయలేదని గుర్తించారు. ఆమెకు రూ. 5 వేల జరిమానా విధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more