చిన్నపిల్లల్ని డీల్ చేయడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు. వాడ వాడలా ఒక క్రెచ్ వున్నా.. వాటిలో తల్లి ప్రేమను అందించే ఆయాలు ఉన్న క్రెచ్ లు మాత్రమే చక్కని బిజినెస్ చేస్తాయి. చిన్నారుల ఆలనా పాలనా చూడటం.. వారు ఇతర చిన్నారులతో సక్యంగా మెలిగేలా చూడటం.. చదువులను చక్కని రైమ్స్ గా ఆటలుగా చేసుకుని ఆడుకునేలా వారిని ప్రోత్సహించడం.. పక్కనున్న చిన్నారులపై వారు చేయి చేసుకోకుండా ఉండటం.. అమ్మానాన్నలు గుర్తుకు వచ్చి ఏడిస్తే వారికి ఇష్టమైన ఆట వస్తువులను ఇచ్చి.. వారిని ఏడవకుండా చేయడం క్రెచ్లోని ఆయమ్మలు చూసుకుంటారు. అలాంటి ఆయమ్మలు ఉన్న క్రెచ్ లు మినహాయిస్తే మిగతాయి ఆయరాం.. గయారాం అన్నట్లుగానే కొనసాగుతుంటాయి.
అలాంటి ఓపిక, పిల్లలతో ఎంతో సహనంగా.. చిరాకు అన్నది తెలియకుండా.. ఒకరు చెబుతుండగానే మరోకరు కూడా వచ్చి మరేదో చెబుతున్నా.. ఎవరికి ఏమి కావాలో దానిని సమకూర్చి.. ఆయమ్మలా కాకుండా అమ్మలా చూసుకునే వ్యక్తులు ఉంటేనే క్రెచ్ నిర్వహణ సాధ్యం. ఈ మధ్యకాలంలో క్రెచ్ల గురించి పెద్దగా వార్తలు రావడంలేదు. అసలు మనన్నలోనే చాలా తక్కువ ఉంటున్నాయి. చిన్నారులతో పని మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. చిన్నారులను ఆడించడంలో ఓపిక, సహనం, శ్రమ మాత్రమే కాదు.. వారు తెలిసీ తెలియక వేసే యక్ష ప్రశ్నలకు తెలివితో సమాధానం చెబుతూ ఉండాలి. వారిని మైమరిపించే టెక్నిక్స్ ఉంటే తప్ప వారిని మేనేజ్ చేయడం కష్టం.
అయితే క్రెచ్ లోని ఆయా కాకుండా తరగతి గదిలో టీచర్ కు కూడా రమారమి ఇంత ఓపికే ఉండాలి. అలాంటి టీచర్.. స్టూడెంట్ల మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. క్లాసులో పదే పదే అల్లరి చేస్తున్న ఓ బుడతడిని ఆ క్లాస్ టీచర్ డీల్ చేసిన విధానం అందరినీ ఆకర్షిస్తున్నది. చిన్నారి.. నువ్వు క్లాసులో బాగా అల్లరి చేస్తున్నావు.. ఇకమీదట అల్లరి చేయను అని చెబుతూనే.. మళ్లీ మళ్లీ తరగతి గదిలో అల్లరి చేస్తున్నావ్.. అంటూ టీచర్ బుంగమూతి పెట్టుకుంటుంది. చిన్నారులకు ప్రేమగా మందలిస్తే వింటారని.. దారిలోకి వస్తారని కూడా ఆ టీచర్ తెలుసు.
నువ్వు అల్లరి చేస్తున్నావు అంటూ బుంగమూతి పెట్టిన తన టీచర్ ను అలక మాన్పించేందుకు ఆ చిన్నారి చేసిన ప్రయత్నమే నెట్టిజనులను అబ్బురపరుస్తోంది. టీచర్ బుంగమూతి పెట్టిన వెంటనే నో టీచర్ ఇక మీద చేయను.. అల్లరి అసలు చేయను టీచర్ సారీ అని టీచర్ దగ్గరకు వచ్చి చెబుతాడు. ఐతే టీచర్ వెంటనే ఓప్పుకోలేదు. లేదే లేదు నువ్ బాగా అల్లరి చెస్తున్నావ్.. చేయనని చెబుతూనే మళ్లీ అల్లరి చేస్తున్నావ్ అంటూ టీచర్ అనగానే.. లేదు లేదు నేను అల్లరి చేయడం లేదు అని చిన్నారి అన్నాడు. అంతటితో ఆగని ఆ చిన్నారి.. టీచర్ భుజాలపై చేతులేసి అమెను ఊరడించేందుకు ప్రయత్నాస్తాడు.
దానికి ఆ చిన్నోడు కూడా లేదు టీచర్ ఇకమీద అల్లరి చేయను అంటూ ఆమెను దగ్గరగా వాటేసుకుని మరీ చెబుతాడు. టీక్ హై.. ఏక్ కాం కరో.. అంటూ ఆ టీచర్ వాడికి ఓ కండిషన్ పెడుతుంది. నిన్ను క్షమించాలంటే నాకో ముద్దివ్వు అని అడుగుతుంది. అడిగిందే తడువు వాడు ఆ టీచర్ రెండు చెంపలపైన ముద్దు పెడతాడు. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజనులు ఫుల్ ఫీదా అవుతున్నారు. పోస్ట్ పెట్టిన కాసేపట్లోనే వీడియో వైరల్గా మారింది. మా చిన్నపుడు కూడా ఇలాంటి టీచర్ ఉంటే బాగుండు నాకు ముద్దు పెట్టే చాన్స్ దొరికేది అని ఒకరు, అరె బుడ్డోడా నువ్ చాలా లక్కీ రా.. అంటూ మరోకరు, ఇలా రకరకాల కామెట్లు, లైక్లతో వీడియో ఫుల్ వైరల్గా మారింది.
ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था pic.twitter.com/uHkAhq0tNN
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more