అమెరికాలో దారుణం జరిగింది. ఉన్నత విద్యతో పాటు ఏదో ఒక పని చేసుకుని అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని కలలుకనే భారతీయుల సంఖ్య చాలా అధికం. ఈ క్రమంలో అనేక మంది అమెరికాలోని పలు రాష్ట్రాలలో స్థిరపడుతున్నారు. ఎలాంటి పనులైనా చేసి.. తమ విద్యను పూర్తి చేసుకున్న తరువాత హుందాగా అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవాలని ప్రపంచంలోని అనేక మందిలానే భారతీయ యువకులు కూడా ప్రయత్నాలు చేస్తూ.. తమ జీవనాన్ని కోనసాగిస్తున్నారు. అయితే వీరి ఎదుగుదలను జీర్ణం చేసుకోలని పలు దేశాల యువకులు జార్జియాలోని కిరాణా షాపులో పనిచేస్తున్న భారతీయ యువకుడిని ఓ దుండగుడు కాల్చిచంపాడు.
షాపులోకి మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు భారతీయ యువకుడిని తుపాకీతో బెదిరించి.. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అందుకు సమ్మతించిన భారతీయ యువకుడు పెద్ద కరన్సీ నోట్లను పక్కనబెట్టి చిన్నవాటిని ఇచ్చేశాడు. అయినా నమ్మని ఆగంతకుడు షాపు కౌంటర్ లోనికి వస్తుండగా, పెద్ద కరన్సీ నోట్లను కూడా ఇచ్చేశాడు. అయితే నోట్ల కోసం వెతికిన ఆగంతకుడు డబ్బులు లేవని గ్రహించి.. భారతీయ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. అమెరికాలోని జార్జియాలో ఈ సంఘటన జరిగింది.
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని పరిశీలించగా, అప్పటికే తీవ్ర రక్తస్రావం జరిగి భారతీయ యువకుడు మరణించాడని పోలీసులు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్ సింగ్ గా భారతీయ యువకుడిని గుర్తించారు. ఇతను జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, అతనిపై కాల్పులు జరిపింది ఆఫ్రికా జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టపగలు తుపాకీతో షాప్‌లోకి ప్రవేశించి.. పరమ్‌వీర్ సింగ్‌ను బెదిరించి డబ్బులు దోపిడీ చేశాడు. అనంతరం అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు.
షాపులో ఉన్న సిసిటీవీల్లో తాను నిక్షిప్తమయ్యానని తెలిసి.. కంప్యూటర్ పరికరాలను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు పరమ్‌వీర్ సింగ్ మృతదేహం పంజాబ్‌లోని సొంత గ్రామమైన ధాపై చేరుకుంది. దీంతో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒక్కడే కుమారుడైన పరమ్‌వీర్ సింగ్ మరణాన్ని వారు తట్టుకోలేపోతున్నారు. మరోవైపు ఆ గ్రోసరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు చెందిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Breaking | #Punjab Youth Shot Dead Inside Grocery Store in #Georgia, Horrific Video Emerges | WATCH
— India.com (@indiacom) September 15, 2022
(Viewer discretion advised) pic.twitter.com/BntaGOIacC
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more