తమిళ సినీ పరిశ్రమలో మరోమారు విషాధఛాయలు అలుముకున్నాయి. ఇటీవల గేయరచయిత కబిలన్ తనయ తూరిగై ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే మరో విషాధ ఘటన కాలీవుడ్ ను ముంచేసింది. తమిళ యువసినీనటి దీప అలియాస్ పౌలిన్ జెస్సిక (29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలో తానుండే ఫ్లాట్‌లోనే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సినీపరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువనటి.. ఇలాంటి దారుణ నిర్ణయాన్ని తీసుకోవడంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్బాంతిని వ్యక్తం చేసింది.
అమె స్నేహితులు, బంధవులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం ఆమెకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో స్నేహితుడు ప్రభాకరన్ ఆమె ఫ్లాట్‌కు వెళ్లారు. అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించారు. ప్రేమలో విఫలమైన దీప.. అంతిమ నిర్ణయం తీసుకుందని ప్రభాకరన్ అనుమానం వ్యక్తం చేశారు. దీప మృతి విషయమై ఆమె సోదరుడు దినేష్ శనివారం రాత్రి కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమె రాసిన మరణవాంగ్మూలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో దీప.. తన మృతికి ఎవరూ కారణం కాదని పేర్కోన్నారు. తాను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకపోవడంతో తానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. దీప సొంత ఊరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ఇంద్రానగర్. దీంతో పోస్టుమార్టం అనంతరం అమె అంత్యక్రియలు ఇంద్రనగర్ లో జరగేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. తమిళ సినీ పరిశ్రమలోని గేయ రచయిత కబిలన్ తనయ తూరిగై కూడా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. అమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అమె అఘాయిత్యానికి పాల్పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more