మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ట్విస్టు ఏర్పడింది. ఈ కేసును ఏపీ హైకోర్టులో విచారించేందుకు బదులు మరో రాష్ట్ర హైకోర్టులో విచారించాలని పిటీషన్ దాఖలైంది. ఈ కేసులో నిందితులకు విచారణకు పిలిస్తే.. అధికారుల పైనే ప్రైవేటు కేసులు వేస్తూ.. దర్యాప్తును అడ్డుకుంటున్నారని.. అలాంటి కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని సిబిఐ తరపున సహాయ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏపీ హైకోర్టులో విచారణ జరిగుతున్నా తమకు న్యాయం జరిగడం లేదని అమె పిటీషన్ దాఖలు చేశారు.
ఏపీ హైకోర్టులో వివేకా హత్యకేసు దర్యాప్తు జరిగితే తమకు న్యాయం జరిగే అవకాశాలు కూడా తక్కువేనని అనుమానాలు వ్యక్తం చేశారు. మూడేళ్లు సమీపిస్తున్నా ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని వివేక తనయ వైఎస్ సునిత, అమె తల్లి సౌభాగ్యమ్మ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఏపీలో విచారణ జరిగితే తమకు న్యాయం అందదని, అందుకని మరో రాష్ట్రానికి కేసు విచారణను బదిలీ చేయాలని సునీతారెడ్డి అత్యున్నత న్యాయస్తానం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. దాంతో ఏపీ సర్కార్‌తోపాటు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను అక్టోబర్ 14 కు వాయిదా వేసింది.
తన తండ్రి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలాయించాలని కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ జరిపినట్లయితే తమ కుటుంబానికి న్యాయం జరుగదని తాము భావిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకని హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసి పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐతో పాటు ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 14 కు వాయిదా వేసింది.
తన తండ్రి హత్య జరిగి దాదాపుగా మూడేళ్ల సమయం కావస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడంలేదని సునీతా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులకు బెదిరింపులు కూడా వస్తున్నాయని, అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసును విచారించాలని ఆమె తన పిటిషన్లో కోరారు. 2019 మార్చి 14 న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఇన్నేండ్లయినా కేసు విచారనలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వివేకా కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more