విమానం కొత్తగా ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు భయాందోళనకు గురికావడం సాధారణమే. ఇక అందులోనూ కాసింత కంగారు పడే మనస్తత్వం ఉన్నవాళ్లు మరీనూ. అయితే విమానం గాల్లో ఉండగా మాత్రం ప్రయాణికులందరూ హాయిగా ఫీలవుతుంటారు. కానీ ఇక్కడ ఓ ప్యాసింజర్ మాత్రం తనను వెంటనే కిందకు దించివేయాలని నానా హంగామా చేశారు. విమానాన్ని తక్షణం కిందకు దింపాలని రచ్చరచ్చ చేశాడు. దీంతో అతనిపై ఏవియేషన్ విభాగం ఇక ముందు విమానంలో ప్రయాణించకుండా సస్పెన్షన్ ను విధించింది.
విమానం సీట్ల మధ్య సిబ్బంది నడిచే దారిలో పడుకుని నమాజ్ చేశాడు. అయితే దానిని అడ్డుకున్న విమాన సిబ్బంది అతడ్ని లేపి సీట్లో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి కదలకూడదని చెప్పారు. అయినా బట్టలు విప్పేసుకుని హల్చల్ చేశాడు. విమానం కిటికీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సీట్లను పదే పదే తన్నాడు. ఆపేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా దాడి చేశాడు. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో గతవారం ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 14న పెషవార్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న పీకే-283 విమానంలో ఈ ఘటన జరిగింది.
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్యాసెంజర్ విచిత్రంగా ప్రవర్తించసాగాడు. విమానంలో ప్రయాణికులు నడిచే ఫ్లోర్‌పై బోర్లా పడుకుని ప్రార్థనలు చేయాలని ఇతరులకు సూచించాడు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా ఊరుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించి బెంబేలెత్తించాడు. అయితే అతడి చర్యలకు తోటి ప్రయాణికులు హడలిపోయారు. ప్రయాణికుడి చేష్టలకు విసిగిపోయిన సిబ్బంది నిబంధనల ప్రకారం అతడ్ని సీటుకు కట్టేశారు. అతడు మరోసారి విమానం ఎక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. ప్యాసెంజర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు ఒకరు ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
#Video A passenger created extreme trouble on a Pakistan International Airlines (PIA) Peshawar-Dubai PK-283 flight as he suddenly started punching seats and kicking the aircraft’s window. pic.twitter.com/bUZ0ZTVNxw
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 19, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more