మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి.. నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి.. మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మల్లి చిగురించాలి.. అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిసే నా రాముణ్ణి.. బంగారు సీతమ్మవై పూజించుకుంటానని.. కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని.. ఈ పాట ఏ చిత్రంలోనిదో తెలుసా.? మావిచిగురు సినిమా.. జగపతిబాబు అమనీ, రంజిత కలసి నటించిన చిత్రమిది. ఈ చిత్రంలోని ఈ పాటను అక్షర మాంత్రికుడు సిరివెన్నల సీతారామశాస్త్రి రచించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమని చేసిన అభినయం సూపర్.
అయితే తాను ఆమనిలా మంచి భార్యను అనిపించుకోవాలని అనుకుందో.. లేక టిక్ టాక్ స్టార్ గా హిట్ అయ్యిన సక్సెస్ మంత్రాను పట్టుకోవాలని అనుకుందో తెలియదు కానీ.. ఈ చిత్రం తరహాలోనే ఆమని పాత్రను పోషించింది ఓ భార్య. తన భర్తకు తన అఫీసులోని మరో యువతితో అక్రమ సంబంధం అంటగట్టి వారిద్దరికీ పెళ్లి చేయించిందీ భార్య పాత్రను పోషించిన ఆమని మాదిరిగానే ఇక్కడ కూడా తన భర్తకు తన ప్రియురాలితో పెళ్లి చేసింది ఓ టిక్ టాక్ స్టార్. అయితే ఆ సినిమాలో అమనికి క్యాన్సర్ అని తేలడంతో ఇలా చేసింది. కానీ ఇక్కడ మాత్రం తన భర్త మాజీ ప్రియురాలని తెలసి వారికి పెళ్లి చేసింది ఈ భార్య.
ఇక్కడే అసలు ట్విస్టు.. ఇకపై ముగ్గురు కలసి కాపురం చేస్తారు. అందుకు అంగీకరించే ఈ పెళ్లి చేయడం గమనించాల్సిన విషయం. వివరాల్లోకి వెళ్తే... తిరుపతిలోని అంబేద్కర్ నగర్ లో ఉంటున్న ఒక యువకుడు టిక్ టాక్ లో రాణిస్తున్న సమయంలో విశాఖకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ చనువుగా ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత టిక్ టాక్ లోనే కడపకు చెందిన మరో అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత విశాఖకు చెందిన అమ్మాయి మళ్లీ తిరిగొచ్చింది. ప్రియుడికి పెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఆమె బాధపడింది. ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాత తాను కూడా ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురం కలిసి ఉందామని ప్రియుడి భార్యతో చెప్పింది. ఈ మాట విన్న భార్య ముందు షాక్ తిన్నా.. తర్వాత ముగ్గురూ కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. నిన్న దగ్గరుండి తానే తన భర్తకు, ఆయన ప్రియురాలికి పెళ్లి జరిపించింది. పెళ్లి కూతురుని కూడా ఆమె స్వయంగా అలంకరించింది. ఈ విషయం తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more