దాదాపుగా మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తమ ఉద్యోగులు.. ఇంట్లో తింటూ పనిచేస్తూ బరువు పెరిగిపోయి ఉంటారన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్యోగులు బరువు పెరిగడం వల్ల తమ సంస్థకు వచ్చిన నష్టమేమి లేదు కానీ.. వారి ఆరోగ్యాలను పరిరక్షించకపోతే భవిష్యత్తులో మాత్రం ప్రమాదం తప్పదని భావించిన ఓ సీఈఓ తమ ఉద్యోగుల ఆరోగ్యాలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఓ సవాల్ విసిరాడు. అయితే ఇది సవాల్ ఏ మాత్రం కాదన్న విషయం తెలిసినా.. వారి అరోగ్యాల కోసం ఇలాంటి ట్విస్టు పెట్టాడు. ఇది సవాల్ అనడం కన్న ఉద్యోగుల ఆరోగ్యంపై ఆయన బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు.
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. దీంతో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఈ సీఈఓ తమ ఉద్యోగుల కోసం ఓ భారీ ఆఫర్ ప్రకటించారు. ఉద్యోగుల అరోగ్యంపై శ్రద్ద చూపిన ఆ కంపెనీ ఏదీ.. ఆ సంస్థ సీఈఓ ఎవరు అని అడుగుతున్నారా.? అదే ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా. ఇక ఉద్యోగుల కళ్లలో సంతోషం నింపే ప్రకటన చేసింది మాత్ర ఆ సంస్థ సీఈఓ నితిన్ కామత్. ఇదిలా ఉంటితే ఇంటకీ ఆఫర్ ఏంటో తెలుసా.?.
బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more