5జీ టెలికాం సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్ధంలో భారత్‌కు ఇది చరిత్రాత్మక దినమన్నారు. టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నట్లు తెలిపారు. 5జీని ఆవిష్కరించడం అంటే.. 130 కోట్ల మంది భారతీయులకు ఇది టెలికం రంగం ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. ఈ దేశంలో కొత్త శకానికి ఇదో ముందడుగు అన్నారు. అపరిమిత అవకాశాలకు కూడా ఇది ఆరంభమే అని ప్రధాని తెలిపారు. 5జీ టెక్నాలజీ విషయంలో నవభారత్ కేవలం ఓ వినియోగదారుడిగా ఉండిపోదు అని, ఆ టెక్నాలజీ అభివృద్ధి విషయంలోనూ యాక్టివ్ పాత్ర పోషిస్తుందన్నారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) వేదికగా 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎరిక్సన్ స్టాల్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడి నుంచి 5జీ కనెక్షన్ ద్వారా రిమోట్ మోడ్‌లో ప్రధాని మోదీ స్వీడన్లో కారును డ్రైవ్ చేశారు. యూరప్‌లోని ఇండోర్ కోర్స్‌లో వాహనాన్ని ఉంచగా కంట్రోల్స్ ఇవ్వడం ద్వారా కారును నడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రిలయన్స్ పెవిలియన్‌ను సందర్శించి జియో గ్లాస్ ద్వారా ట్రూ 5జీ డివైజ్‌లను పరిశీలించారు.
ఇక భారత్‌లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించడంతో యూజర్లు దీపావళి నుంచి 5జీ సేవలను ఆస్వాదించనున్నారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిలో ఇండియా ఇక దూసుకువెళ్తుందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఎయిర్టెల్, రిలయన్స్ జియో వంటి టెలికాం కంపెనీలు త్వరలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 23 నాటికి దేశం నలుమూలలా అన్ని పట్టణాలు, గ్రామాల్లో జియో సేవలు ప్రారంభిస్తామని ఐఎంసీ వేదికపై ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు.
India driving the world.
— Piyush Goyal (@PiyushGoyal) October 1, 2022
PM @NarendraModi ji tests driving a car in Europe remotely from Delhi using India’s 5G technology. pic.twitter.com/5ixscozKtg
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more