వాన్‌పిక్‌కు అక్రమ భూ కేటాయిం పుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తనకు న్యాయ సహాయం అందించాల్సిం దిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు ముఖ్య మంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి పేషీకి చంచల గూడ జైలు నుంచి లేఖ రాసినట్లు సమాచారం. సిఎం ప్రత్యేక ముఖ్య కార్య దర్శి బినయ్ కుమార్‌కు ఈ అభ్యర్థన అందినట్లు తెలుస్తోంది. అ లేఖలో తాను అరెస్టయి నేటికి నెలరోజులు గడుస్తున్నందున అప్పట్లో వారం, పది రోజుల్లోనే బయటకు వస్తానని తనకు భరోసా ఇచ్చిన వారంతా ఇప్పుడే మయ్యారని ఆవేదన వ్యక్తంచేశారని తెలుస్తోంది. ఎలాగైనా తనను బయట పడేయాలని, జైలు జీవితం ఘోరంగా ఉందని, గడపడం కష్టంగా ఉందనిఆయన పేర్కొన్నారని తెలుస్తోంది. కాగా, తనకు తెలిసినంత వరకు మోపిదేవి ఏ తప్పూ చేసి వుండరని, ఆయన తొందరగా బయటకు వస్తారని సిఎం కిరణ్ మొదట్లోనే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మోపిదేవి కుటుంబ సభ్యులను కూడా సిఎం పరామర్శించారు.
ఈ నేపథ్యంలో మోపిదేవి అభ్యర్థన పట్ల సర్కార్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందం టున్నారు. ఇప్పటికే ఓఎంసి, జగన్ అస్తులు, ఇమ్మార్ కేసుల్లో ఉన్న మిగతా ఐదుగురు మంత్రు లు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి ప్రభుత్వ అందిస్తున్న న్యాయపరమైన సహాయంతోనే సిబిఐ ముందు సమాధానాలు ఇవ్వడంతో పాటు, సుప్రీంకోర్టు నోటీసులకు కూడా స్పందిస్తున్నారు. అయితే మోపిదేవి జైలులో ఉండటంతో ప్రభుత్వం నుంచి న్యాయ సహాయం అందడం లేదని అభిప్రాయాలు వస్తున్నాయి. మోపిదేవి గత నెల 25వ తేదీన అరెస్ట్ అయిన తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సిఎం కిరణ్‌కు తన సన్నిహిత మిత్రుడు ద్వారా అందజేయింంచారు. ఆ లేఖలో దివంగత నేత వైఎస్సార్ నమ్మినందున ఆయన ఎక్కడ సంతకం పెట్టాలని చెబితే అక్కడ పెట్ట్టానని పేర్కొన్న మోపిదేవి తన బెయిల్ పిటీషన్‌లో ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిం చలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more