గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ ప్రకటనతో.. స్వలింగ సంపర్కలకు.. కాస్తా ఊరట లభించింది. దీంతో ఈరోజు స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. భారత శిక్షాస్మృతి 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు తన తీర్పును పునరాలోచించాలని కేంద్రం వాదించింది. డిసెంబర్ 11న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి పడేస్తూ స్వలింగ సంపరాన్ని నేరంగా సుప్రీం అనుబంధ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే. అటార్నీ జనరల్ జీఈ వాహనవతి వేసిన రివ్యూ పిటిషన్‌లో బహిరంగ న్యాయస్థానంలో స్వలింగ సంపర్కంపై వాదోపవాదాలు జరిగాలని కోరారు. సాధారణంగా రివ్యూ పిటిషన్లను కోర్టు చాంబర్లలోనూ విచారించడం ఆనవాయితీ. రాజ్యాంగంలోని అధికరణాలు 21,14, 15 కింద భారత పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా సుప్రీం తీర్పు ఉందని కేంద్ర ప్రభుత్వ తన రివ్యూ పిటిషన్‌లో వాదించింది. దీనిపై పునరాలోచించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
భారత శిక్షా స్మృతి 377 కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ సుప్రీం అపెక్స్ కోర్టు వెలువరించిన తీర్పుపై చర్చ జరగాలని, అది ముగిసిన అధ్యాయం కాదని బీజేపీ అభిప్రాయపడింది. ఈ విషయంలో న్యాయస్థానం 377 సెక్షన్ కిందకి ఏది వస్తుందో, ఏదీ రాదో స్పష్టం చేయలేదని, అందులో గందరగోళం నెలకొందని, దీనిపై స్పష్టత రావాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ అన్నారు. సెక్షన్ 377పై సుప్రీం తీర్పును స్వాగతించిన ముస్లిం నేతలు కాంగ్రెస్, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ వైఖరి మార్చుకోకపోతే దేశంలోని మైనారిటీలు 2014 ఎన్నికల్లో బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ, ఏఏపీ కోర్ కమిటీ సభ్యుడు ఇలియాస్ అజ్మీ హెచ్చరించారు. దేశంలోని ముస్లింలు ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి మద్దతు పలుకుతారని, ఇందులో లౌకికవాదం, మతోన్మాదం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 20 | ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా ’ అన్నట్లు... మన దర్శకధీరుడు రాజమౌళి తలుచుకుంటే తన సినిమాలో ఎంతమంది స్టార్లనైనా పెట్టుకొంటాడు. రాజమౌళి ప్రస్తుతం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు... Read more