(Image source from: central minister rajnath singh comments on dawood ibrahim)
మన భారతదేశానికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎందరో వున్నారు. అందులో ముఖ్యంగా మొదటిపేరు వినిపించేది దావూద్ ఇబ్రహీం. ఇతను ముంబయిలో ఎన్నో మారణకాండలను సృష్టించి ఎందరో అమాయకులను బలితీసుకున్న బతికున్న నరరూప రాక్షసుడు! పసిపిల్లల నుంచి వృద్ధులవరకు ఎవరినీ వదలకుండా ఎందరో మరణాలకు కారణమైన ఏకైక క్రిమినల్ ఈ దావూద్ ఇబ్రహీం. ముఖ్యంగా 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ల కేసులో ఇతను ప్రధాని నిందితుడు.
దావూద్ ను పట్టుకోవడానికి మన భారత ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇతను ఎక్కడున్నాడో కూడా పక్కా ఆచూకీ ఎవరికీ తెలియదు. కానీ కొన్ని వార్తాకథనాల ప్రకారం.. దావూద్ పాకిస్తాన్ లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ...
* అంతర్జాతీయ నేరస్తుడు అయిన దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
* ప్రస్తుతం దావూద్ కోసం గాలింపు చర్యలను వేగవంత చేశామని.. పాకిస్తాన్ లో ఎక్కడో అతను తలదాచుకున్నాడని.. త్వరలోనే అతనిని అరెస్ట్ చేయడం ఖాయమని ఆయన తెలిపారు.
* గత ప్రభుత్వాలు కూడా దావూద్ ను పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని... ఇప్పుడు తమ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రయత్నంలో వుందని స్పష్టం చేశారు.
* దావూద్ లాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ప్రపంచంలో బతికే అర్హత లేదని.. భారత ప్రభుత్వం అటువంటి నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోదని ఆయన వెల్లడించారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more