(Image source from: botsa satya narayana comments on temporary capital vijayawada of andhra pradesh)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీసీస చీఫ్ గా కొనసాగిన బొత్ససత్యనారాయణ... సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో అడ్రస్ లేకుండా పోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కారణంతో తాము చేసిన తప్పులను సవరించుకునేందుకు ఆ పార్టీ తరఫున ఎన్నో మీటింగ్ లు నిర్వహించగా.. అందులో దాదాపు ఆయన డుమ్మా కొట్టినవే! ఏదో అప్పుడప్పుడు కనిపించడం తప్ప! అంతేకానీ ఈయన ఏ పార్టీ నాయకుడిమీద విమర్శలు మాత్రం గుప్పించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈయన మరోవివాదంతో తెరమీదకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటూ ఆయన గొంతు విప్పారు. అయితే ఆయన చెప్పింది శాశ్వత రాజధాని గురించి కాదులెండి... తాత్కాలిక రాజధాని మీద! ఏపీ ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎన్నుకున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈయన దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ....
* ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిగా రాజధానికి హైదరాబాద్ వుండగా... మళ్లీ విజయవాడను ఎందుకు ఎన్నుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు.
* తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లాభం చేకూర్చేందుకే విజయవాడను తాత్కాలికంగా రాజధానిని చేశారని ఆయన ఆరోపించారు.
* ఈ విషయంలో అఖిలపక్షం నిర్వహించకుండా.. చంద్రబాబు సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.. దీనివెనుక మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు.
* విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాస్తామని బొత్స ప్రకటించారు.
* చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more