ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోటీలో పాలుపంచుకుంటున్న పార్టీలన్నీ ఒకదానిమీదొకటి తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా బీజేపీ, ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) పార్టీలైతే ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికైన కిరణ్ బేడీ గతంలో కేజ్రీవాల్’తో కలిసి అన్నాహజారే ఉద్యమంలో పాల్గొన్న విషయం విదితమే! అయితే మోడీ ప్రవేశపెట్టిన విధానాలకు తాను ఆకర్షితురాలినయ్యానంటూ బేడీ బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో కేజ్రీకి, ఆమెకు మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బరిలో వున్నవారందరూ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే.. ఆయన ఏ పార్టీ మీద ఆరోపణలు గుప్పించకుండా తనదైన రీతిలో అభిప్రాయాలను వెల్లడించారు. తాను పార్టీకో, వ్యక్తికో వ్యతిరేకంగా పోటీ చేయడం లేదంటూ తెలిపిన ఆయన.. మరిన్ని అభిప్రాయాలను వెల్లడించారు.
* ఢిల్లీ ఎన్నికల పోరులో తాను ఒక పార్టీకి లేదా వ్యక్తికి వ్యతిరేకంగా పోటీ చేయడం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
* గత ఎన్నికల్లో తన పార్టీకి పరిమిత స్థానాలు కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలు.. ఈసారి పూర్తి మెజారిటీ అందించాలని కోరారు.
* గతంలో చేసిన పొరబాట్లు మళ్లీ దొర్లకుండా చూసుకుంటానని, తన సాయశక్తుల ప్రయత్నించి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని కేజ్రీ హామీ ఇచ్చారు.
* ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు పూర్తిగా వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పిన ఆయన.. పెరిగిన ధరలన్నింటినీ తగ్గిస్తానని హామీ ఇచ్చారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more