తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పంగా మారుతున్నాయి. ఇటీవలే సచివాలయానికి వాస్తు దోషం వుందంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన కేసీఆర్.. దాన్ని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి తరలిస్తామని వెల్లడించిన విషయం విదితమే! ఇప్పుడదే పెద్ద దుమారంగా మారింది. ఓవైపు రైతులు కరెంట్ కోతలతో, నీటి సమస్యతో, రుణమాఫీల ఇబ్బందులతో తీవ్ర నష్టంలో కూరుకుపోతుంటే.. కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోకుండా అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టీ.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తనదైన రీతిలో కేసీఆర్’పై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ దోషం వుందంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
* సచివాలయానికి గానీ, తెలంగాణ రాష్ట్రానికి గానీ ఎలాంటి వాస్తు దోషం లేదన్న మోత్కుపల్లి.. కేసీఆరే ఆ రాష్ట్రానికి పెద్ద దోషమని మండిపడ్డారు.
* సచివాలయానికి వాస్తు దోషం వుందంటూ చెస్ట్ ఆసుపత్రిని తరలించాలనుకోవడం చాలా దారుణమని అన్నారు.
* చెస్ట్ ఆసుపత్రిని ఎర్రగడ్డలోనే వుంచాలని, లేకపోతే దీనిపై ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు.
సోమవారం (02-02-2015) టీటీడీపీ నేతలు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగానే మోత్కుపల్లి మాట్లాడుతూ కేసీఆర్’పై విమనాస్త్రాలను సంధించారు. ఇక జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ఈ చెస్ట్ ఆసుపత్రికి రోజూ 50 వేల మందికిపైగా రోగులు వస్తారని, అటువంటి దాన్ని తరలించడం సమంజసం కాదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more