వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై అసెంబ్లీలో బాబు చేసిన ప్రకటనపై జగన్ స్పందించారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలకు చక్కని కథ చెప్పారంటూ ఆయన ఎద్దేవా చేశారు. పీపీఏలు చేసుకోవడానికి ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
అప్పట్లో ఛార్జీలు పెంచితే ప్రజలను తిరగబడమని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన బాబు.. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టుకోలేకపోయారని ఆయన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఎలాంటి హేతుబద్ధత లేదని.. పెంపు నిర్ణయాన్ని తాము వ్యతిరేస్తున్నామని జగన్ తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే.. వైఎస్ పాలనలో బాబు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు కానీ.. అప్పుడు ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ అంశంలో వైఎస్ పాలనలో అద్భుతమైన క్రిసిల్ రేటింగ్ వచ్చిందని, కానీ బాబు తన ప్రసంగంలో ఆ విషయమే ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పని తేలితే బాబు పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
ఇక కిరణ్ పాలన గురించి జగన్ మాట్లాడుతూ.. కిరణ్ పాలన కారణంగా వేలకోట్ల భారం పడిందంటున్న బాబు.. అదే కిరణ్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు విప్ జారీ చేయకపోతే.. కిరణ్ సర్కార్ వుండేదే కానీ, రాష్ట్ర విభజన అస్సలు జరిగేదే కాదని ఆయన దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more