వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పార్టీ మధ్య నిత్యం ఏదో వివాదం చెలరేగుతూనే వుంటుందన్న విషయం తెలిసిందే! టీడీపీ తరఫున ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని వైకాపా తప్పుపట్టడం... అదే వైకాపాలో ఎవరైనా ఏదైనా చేస్తే దానిపై టీడీపీ వక్రీకరించడం లాంటివి జరుగుతూనే వున్నాయి. మొన్నీమధ్యే అసెంబ్లీలో ఈ రెండు పార్టీల మధ్య భీకరమైన మాటలయుద్ధం కూడా జరిగిన విషయం అందరికీ విదితమే! మొత్తానికి చెప్పాలంటే.. ఈ రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం వుంది. ఇక నగరి వైకాపా ఎమ్మెల్యే, నటి రోజాకి, టీడీపీకి మధ్య గతకొన్నాళ్ల నుంచి మాటలపోరు జరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఆమె మరోసారి టీడీపీ మీద ధ్వజమెత్తారు.
తమ పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా దాన్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. వైఎస్ జగన్ ఢిల్లీకెళ్లి ప్రధాని మోదీతో కలిసొచ్చిన సంగతి తెలిసిందే! జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు తమ వాదనలు వినిపించారు. వారు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రోజా.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్ జగన్ ఢిల్లీకి వెళితే మీకెందుకు భయం?’ అంటూ ఆమె ప్రశ్నించారు. జగన్ కేంద్రం పెద్దలను కలిస్తే పట్టిసీమ బండారం వెల్లడవుతుందని టీడీపీ నేతలు భయపడుతున్నారని, అందుకే వాళ్లు ఈ పర్యటనను వక్రీకరిస్తూ జగన్ ను విమర్శిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అసలు పట్టిసీమ రాయలసీమకు మేలు చేకూర్చది కాదని.. కేవలం బాబు, లోకేష్ లకు మాత్రమే ఉపయోపడుతుందని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇక యనమల రామకృష్ణ మీద విమర్శలు గుప్పించిన రోజా.. అసలు ఆయన మంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలుసునని అన్నారు. అలాంటి వ్యక్తి జగన్ ను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా వున్న జగన్.. ప్రజల సమలస్యలపై ప్రధాని మోదీని కలవడం తప్పా..? అని రోజా టీడీపీ నేతలను అడిగారు. మరి.. దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more