పొగాకును నిషేధించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్న కేంద్ర మాజీ మంత్రి రాందాస్.. భారత ఎంపీలమీద ఒక్కసారిగా ధ్వజమెత్తారు. ఎంపీలందరూ ప్రపంచం దృష్టిల్లో బుద్ధిలేని నేతలుగా మిగులుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. పోగాకు ఉత్పత్తుల ద్వారా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి సాక్ష్యం లేదని దిలిప్ గాంధీ, శ్యామ్ చరణ్ గుప్తా, రామ్ ప్రసాద్ శర్మ తదితర లోక్ సభ సభ్యులు పేర్కొన్నారు.
నిజానికి.. వీరు ముగ్గురు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేందుకు తీసుకురానున్న కొత్త విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులు! అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు.. మధుమేహాన్ని కలిగిస్తున్న పంచదారకు లేని నిషేధం.. పొగాకుకు ఎందుకని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే రాందాస్ భారత ఎంపీలు బుద్ధిలేని వారుగా మిగులుతున్నారని వారిపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే రాందాస్ మాట్లాడుతూ..
* ధూమపానం వల్ల క్యాన్సర్ రాదని అత్యంత మూర్ఖ వ్యాఖ్యలు చేస్తున్న పార్లమెంట్ సభ్యులు ప్రపంచ దృష్టిలో బుద్ధులేని నేతలుగా మిగులుతున్నారు.
* పొగాకుతో ఆరోగ్యం పాడవుతుందని వందలాంది అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలియని ప్రజాప్రతినిధులతో కూడిన బీజేపీ దేశాన్ని పాలిస్తోంది.
* ఇండియాలో రోజుకు 5,500 మంది చిన్నారులు పొగాకు సేవనానికి అలవాటు పడుతుండగా.. 2,500 మంది పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more