goa minister deepak dhavalikar wife Lata Dhavalikar controversial comments on women

Goa minister deepak dhavalikar wife lata dhavalikar controversial comments on women

Lata Dhavalikar news, Lata Dhavalikar press meet, Lata Dhavalikar controversy, goa minister deepak dhavalikar, deepak dhavalikar controversy, gudi padwa festival, convent schools, foreign culture, indian women, hindu dharmam

goa minister deepak dhavalikar wife Lata Dhavalikar controversial comments on women : goa minister deepak dhavalikar wife Lata Dhavalikar makes controversial comments on women. she said that nowadays women behaviour changed. they forget hindu dharmam.

మహిళలు వింతగా తయారవుతున్నారు : మంత్రి భార్య

Posted: 04/06/2015 01:39 PM IST
Goa minister deepak dhavalikar wife lata dhavalikar controversial comments on women

గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న మహిళలు చాలా వింతగా, విచిత్రంగా తయారవుతున్నారని ఆమె అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని అవలంభించడం వల్లే అత్యాచారాలు పెరగుతున్నాయని, అందుకు దూరంగా ఉండాలని ఆమె ఉచిత సలహాయిచ్చారు. వివాదస్పద సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ...
* పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
* హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ్ పెట్టుకోవాలని సూచించారు.
* జనవరి ఫస్ట్ కాకుండా ‘గుడి పడ్వా’ను నూతన సంవత్సరంగా జరుపుకోవాలని అన్నారు.
* అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ భారత మహిళలు వింతగా తయారవుతున్నారని మండిపడ్డారు.
* నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
* శరీర కొలతలు కొట్టొచ్చినట్టు కనబడేలా బిగుతు బట్టలేసుకుంటున్నారని, జడలు వేసుకోవడం మానేసి జుత్తును కత్తిరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈమె ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. మతం ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడగొట్టే కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. మరోవైపు మహిళాసంఘాలు కూడా ఈమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు తన భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దీపక్ ధవలికర్ నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lata Dhavalikar  deepak dhavalikar  women controversy  hindu dharmam  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more