ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధానిని నిర్మించాలని పట్టుదలతో వున్నారు. ఇప్పటికే రాజధాని ఎలా వుండబోతోందో కొన్ని ఊహాచిత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఏపీ రాజధాని చాలా అద్భుతంగా వుండబోతోందని, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచే విధంగా రూపొందనుందని తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ రాజధాని విషయమై సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే అమరావతి ఎంత అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీ రాజధాని నగరంపై ఇన్నాళ్లూ నోరు మెదపని కేసీఆర్.. ఇప్పుడు దానిగురించి రెండు రాష్ట్రాల్లో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పెదవి విప్పారు. 400 ఏళ్ల ఘనమైన చరిత్ర వున్న హైదరాబాద్ నగరం ముందు ఇప్పటికీ కాగితాలపైనే వున్న అమరావతి ఎంతో గొప్పదన్న విషయాన్ని ఆంధ్రా మేధావులు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. అంటే.. ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరమే ఎంతో గొప్పదన్న తన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. తనను విమర్శిస్తే సహిస్తానని... తెలంగాణ రాష్ట్రాన్నిగానీ, హైదరాబాద్ నగరాన్నిగానీ కించపరిచినట్లు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంస్కృతి, సంస్కారం వుందని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు హైదరాబాదును చూసి అసూయ పడుతున్నారని భ్రమలకు పోతున్నారని ఆయన విమర్శించారు. అటువంటి ఆలోచనలు వదిలేసి ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ హితవు పలికారు. మరి.. ఈయన చేసిన కామెంట్లపై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more