ప్రతిపక్ష పార్టీలపై సున్నితంగా విమర్శలు గుప్పించే భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారి అందుకు భిన్నంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీపై అంతెత్తున ఎగిసిపడ్డారు. ఆ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే.. దానికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారంటూ ఆయన కాంగ్రెస్ పై పరోక్షంగా ఆరోపించారు.
పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వాదోపవాదనలు జరిగిన విషయం విదితమే! ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభలో రచ్చరచ్చ చేయడంతో సమావేశాలు ఆందోళనకరంగా సాగాయి. ఈ అంశాన్ని పురష్కరించుకుని తాజాగా మోదీ గరం అయ్యారు. లోక్ సభలో తమ గొంతు నొక్కితే జనసభకు వెళతామని, అది పార్లమెంట్ దిగువసభ కంటే పెద్దదని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో వారు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత కొన్ని పార్టీలను ప్రజలను క్షమించరంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అహంకారంతో ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతున్నారని మోదీ మండిపడ్డారు.
ఛండీగడ్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో.. మోదీ పై విధంగా కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసిన ఘనత తమదేనంటూ మోడీ వెల్లడించారు. మరి.. మోదీ చేసిన (పరోక్ష) ఘాటు కామెంట్లపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో?
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more