Cm kiran final game in ap bifurcation

cm kiran final game in ap bifurcationm Chief Minister N Kiran Kumar Reddy, cm kiran vs congress high command, final option, bifurcation of Andhra Pradesh, telangana issue, telangana bill, assembly, speaker manohar,

cm kiran final game in ap bifurcation, cm kiran vs congress high command

ఫైనల్ కి చేరిన కిరణ్ గేమ్ ?

Posted: 11/22/2013 04:30 PM IST
Cm kiran final game in ap bifurcation

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య గేమ్ తారాస్థాయి (ఫైనల్) కి చేరినట్లు ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సమైక్యాంద్ర కోసం చివరి బంతి వరకు పోరాటం చేస్తానని రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎలాగైనా సరే రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. అయితే అదే బాటలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజన పై దూకుడు పెంచినట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఈ ఇద్దరి మద్య ఫైనల్ పోరు జరుగుతున్నట్లుగా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు జోకులు వేసుకుంటున్నారు. అయితే ఈ పైనల్ గేమ్ లో ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడతారు అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి

 

కాంగ్రెస్ హైకమాండ్ ఎలాగైన తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశల్లో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. అయితే తెలంగాణ బిల్లును ఎలాగైన అడ్డుకోవాలని కిరణ్ అండ్ కో.. తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ బిల్లుతో పాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మార్చితే.. రెండు సమస్యలు ఒకేసారి తొలగిపోతాయి.. అనే ఉద్దేశంలో.. ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందులోబాగంగా.. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి. సీమాంద్రలోని ముఖ్య నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు గాంధీ భవన్ లోని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

 

రాష్ట్ర విభజనపై జరుగుతున్న ఫైనల్ గేమ్ లో.. స్పీకర్ నాదేండ్ల మనోహర్ ను దిగ్విజయ్ సింగ్ రంగలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైన తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పాస్ కావాలనే ఉద్దేశంతో.. ఆ బరువు బాధ్యతలను స్పీకర్ పై పెట్టినట్లు సమాచారం. అయితే దిగ్విజయ్ సింగ్ తో స్పీకర్ మనోహర్ .. అసెంబ్లీ జరిగే తంతు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పటంతో, రంగంలోకి గవర్నర్ ను దించి, తెలంగాణ బిల్లును పాస్ చేసుకోవలనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి నల్లారి టీమ్ మాత్రం.. పైనల్ గేమ్ జరగకుండా, సమస్యను జఠిలం చేయ్యాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే చివరకు రాష్ట్ర విభజన గేమ్ లో గెలిచిదేవరు? ఓడేదేవరు, అనేది మరి కొద్దిరోజుల్లో తెలుస్తోందని రాజకీయ మేధావులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles