Yanamala questioned by sonia birthday

yanamala questioned by sonia birthday, Sonia Gandhi birthday, T Bill linked to Sonia 67th Birthday, Yanamala Ramakrishnudu, TDP, congress party, telangana issue, telangana state, seemandhra people, ap bifurcation,

yanamala questioned by sonia birthday, T Bill linked to Sonia 67th Birthday

అమ్మ ‘ఇదేం ’ బర్త్‌డే కానుక

Posted: 11/27/2013 11:10 AM IST
Yanamala questioned by sonia birthday

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ..కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు ఏమైన సంబంధ ఉందా? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రజలు అందరు .. సోనియా గాంధీ పుట్టిన రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మ పుట్టిన రోజు డిసెంబర్ 10న వస్తుంది. అయితే ఇప్పుడు అందరి కళ్లు డిసెంబర్ 10 తారీఖు పైనే ఉన్నాయి. అమ్మ పుట్టిన రోజు కానుక .. తెలంగాణ ప్రజలకు , తెలంగాణ నాయకులకు పెద్ద కానుక ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంతాం వారికే వర్తిస్తుంది.

 

అయితే సీమాంద్ర ప్రజలకు , సీమాంద్ర నాయకులకు అమ్మ పుట్టిన రోజు నాడే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు ప్రజలు, తెలుగు జాతి, రెండు గా విడిపోవటం ఇష్టం లేదని అంటున్నారు. అమ్మ పుట్టిన రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడుతున్నారు. సోనియా గాంధీ బర్త్‌డే తో లింకు పెట్టి రాష్ట్రాన్ని విభజించడం, రాష్ట్ర విభజనతో లింకు పెట్టి వైఎస్‌ జగన్‌కు బెయిల్‌ ఇప్పించడం ఎక్కడి సంప్రదాయమని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

 

సోనియా బర్త్‌ డే నాడు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో పెట్టే సంప్రదాయం ఏమిటని, ఇలాంటి సంప్రదాయాలు ఎక్కడా లేవని, ఇదేమైనా ఇటలీ సంప్రదాయమా? అని ప్రశ్నించారు. దేశం కాని దేశం ఇటలీలో ఎప్పుడు పుట్టిందో తెలియని సోనియా బర్త్‌డేకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఏ విధమైన సాపత్యం ఉందని బెయిల్‌, బర్త్‌ డేలతో రాష్ట్ర విభజన చేసి తెలుగు జాతి మధ్య విద్వేషాలు రగిలించడం ఏమిటని యనమల ప్రశ్నించారు. అంటే అమ్మ పుట్టిన రోజు.. ఒకరికి తీపి, మరొకరి చేదు అందించాలనే ఉద్దేశంలో ఉందా అనే అనుమానం తెలుగు ప్రజలకు కలుగుతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles