తెల్లవారితే తెలుగు దేశం పార్టీ తమ్ముళ్లు భయపడి పోతున్నారు. నిన్నటి వరకు మీడియా ముందు రాజకీయ ప్రకటనలు చేసి, రాజకీయంలో ప్రకంపనలు రేపిన రెబల్ తెలుగు తమ్ముళ్లు మీడియా ను చూస్తే వణికి పోతున్నారు. కాదు.. కాదు.. ముఖం చాటేస్తున్నారు. మీడియా కు దూరం దూరంగా ఉంటున్నారు. అసలు వీరు ఇలా ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని అంటున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర విభజన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ లేఖ రాయడం వలనే రాష్ట్ర విభజన జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కలర్ పుల్ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు టిడిపి తమ్ముళ్లు రెండు ప్రాంతాల నాయకులుగా విడిపోయి, బూతులతో రెచ్చిపోయి తిట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీకి మరో సమస్య వచ్చిపడింది.
కాంగ్రెస్ పార్టీ తెరపైకి రాయల్ తెలంగాణ అంటూ కొత్త ప్రకటన మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో తెలుగు దేశం తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. నిన్నటి వరకు తమ్ముళ్ల మద్య.. తెలంగాణ కావాలని కొంతమంది, సమైక్యంగా ఉంచాలని మరి కొంతమంది నాయకులు మీడియాలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే రాయల తెలంగాణ పేరు వినిపించటంతో.. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు ముఖాలు మాడిపోయాయి. ఇప్పుడు రాయల తెలంగాణ పేరు తెరపైకి రావడంతో.. టిడిపి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి లాంటి నాయకుల సైతం సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇటు తెలంగాణ టిడిపీ నాయకులు గానీ, అటూ కోస్తా టిడిపి నాయకులు గానీ, రాయలసీమ నాయకులు గానీ.. ఎదురుపడితే పలకరింపులు కరువయ్యాయట. ఒకవేళ మీడియా చొరవ తీసుకొని పలకరిస్తే.. నా చాలా అర్జెంట్ అంటూ.. బాత్ రూమ్ లోకి వెళ్లి మధన పడుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అంటే మీడియాతో ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో, అర్థంగాక తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారు.
ఎప్పుడు ఎన్టీఆర్ భవన్ లో రాత్రి 11 అయిన తరువాత సీనియర్ నాయకులతో సందడిగా ఉండేది. కానీ రాయల తెలంగాణ పేరు తెరపైకి వచ్చినప్పటి నుండి.. ఎన్టీఆర్ భవన్ సాయంత్రం 5 గంటలకే ఖాళీ అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు తెల్లవారిందంటేనే.. భయంతో వణికిపోతున్నారని.. పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. కొంతమంది నాయకులు అయితే.. లంచ్ సమయంలో ఎన్టీఆర్ భవనానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అంటే ఎక్కువు సమయం ఇంటిలోనే తెలుగు తమ్ముళ్లు గడుపుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. రాయల తెలంగాణ తో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారనే విషయం అందరికి అర్థమవుతుంది. దీనిపై చంద్రబాబు ఏం మాట్లాడతారో చూడాలని.. ఆ పార్టీ నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more