కేసిఆర్ ఇచ్చిన మాటను మరిచిపోతున్నారు, కేసిఆర్ ఆడిన మాట తప్పుతున్నాడని ఇటీవల కేసిఆర్ పై కొన్ని రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే.. తెలంగాణ కు మొదటి ముఖ్యమంత్రి ఒక దళితుడ్ని చేస్తానని రాజకీయ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మాటను కేసిఆర్ తప్పుతున్నారనే రాజకీయ మాటలు రాజకీయ నాయకుల మద్య బాగా వినిపిస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణ కోసం టిఆర్ఎస్ పెట్టి, అప్పటి నుంచి తనది అధికారం కోసం పోరాటం కాదని, రేపు తెలంగాణ వచ్చాక మొదటి సిఎం దళితుడినే చేస్తానని ఇన్నాళ్లు చెప్పిన కేసిఆర్ ఇప్పుడు ఆ మాటకో దండం, అధికారమే ముఖ్యం అంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘ఏరుదాటేదాక ఏటి మల్లన్న, ఏరు దాటాకా బోడి మల్లన్న’’ అన్న నానుడిని కేసిఆర్, సోనియాగాంధీలు పాటిస్తున్నట్టు కనబడుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
నిన్నటి దాకా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా వారిద్దరు కీలమైన ఓ విషయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని తీసి గట్టున పెడుతున్నారన్న సంకేతాలు దాదాపుగా జారీ అయ్యాయని ఢిల్లీ నాయకులు అంటున్నారు. విలీనం అయినా కూడా సిఎం పదవి విషయంలో దీనికి కట్టుబడి ఉండాలన్నది సోనియాకు కేసిఆర్ కు మద్య ఒప్పందం కూడా కుదిరిందన్న ప్రచారం జరిగిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి సోనియా, కేసిఆర్ లు ఈ విషయాన్ని తీసి పక్కన పెట్టి వారి అసలు స్వరూపం బయట పెట్టుకోబోతున్నారు అన్న వాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు ఉభయసభల్లో ప్రవేశపెట్టడానికి సిద్దమయినప్పుడే కేసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఆశ చూపెట్టి టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేలా చూడాలని సోనియా భావిస్తున్నట్లు వార్తలు వెలుబడ్డాయి. అన్నట్లుగానే విలీనంపై నిర్ణయం తీసుకుంటున్నారు.
అంతేకాకుండా కేససిఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ని కలవటం ఇక్కడ పెద్ద చర్చగా మారింది. తన పార్టీ ముఖ్యనేతలతో కాకుండా కుటుంబ సభ్యులతో కలవటంతో. పార్టీ నాయకుల మద్య పెద్ద చర్చ జరుగుతుంది.
అంతే కాదు ఆయనను తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా కూడా ప్రకటిస్తారు అంటూ వార్తలు మీడియాల్లో వస్తున్నాయి. దీంతో కేసిఆర్ పదవి, అధికారమే ముఖ్యం కాని రాజకీయాల్లో ఇచ్చిన మాటపై నిలబడడం కాదన్న విషయం మరోసారి రుజువుకాబోతోంది అంటూ రాజకీయవర్గాల్లో కూడా చర్చ మొదలయింది.
ఏమైన కొద్ది రోజులు ఆగితే..కేసిఆర్ లో అసలు రూపం బయటపడుతుందని .. రాజకీయ మేథావులు అంటున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకొని, దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తారో, లేక సోనియాగాంధీకి శిష్యుడుగా మారి, తెలంగాణ దళిత ప్రజల్ని మోసం చేస్తోడో చూద్దాం. ఊసరవెల్లి రంగు మార్చటం కంటే.. రాజకీయల్లో మాటల మార్చటం చాలా ఇజీగా జరుగుతుంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more