కేంద్ర మంత్రి కె చిరంజీవి రాజకీయల్లో ముదిరిపోయారు. నిన్నటి వరకు చంటబ్బాయిలాగ ఉన్న చిరంజీవి సీనియర్ రాజకీయ నాయకులకే చేమట్లు పుట్టిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి కోసం సంవత్సరం పాటు ఎదురు చూసిన చిరంజీవి ఇప్పుడు అవకాశం వస్తే అల్లుకుపోవటానికి సిద్దంగా ఉన్నారు. అధిష్టానం ఏ బాధ్యతలు అప్పచెప్పిన, నేను చెయ్యటానికి సిద్దమే అని చిరంజీవి అంటున్నారు.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో రాజకీయలు కొత్త రంగు పులుముకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయటం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు పార్టీ వదిలిపోవటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆంద్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తలనొప్పిగా మారాయి. హైకమాండ్ వద్ద ఎంత మంది తలపండిన నాయకులు ఉన్నప్పటికి .. ఆంద్రప్రదేశ్ రాజకీయ నాయకులు రాజకీయలతో పోటీపడలేకపోతున్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మొదట కాంగ్రెస్ హైకమాండ్ అనుకున్నతరువాత తన నిర్ణయాన్ని మార్చి కొత్త సీఎం ను నియమించే బాటలో కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతుంది.
ఈ సందర్భంలోనే ఇరుప్రాంతాల నాయకులు సీఎం పదవి కోసం ఢిల్లీలో లాబీయింగులు మొదలు పెట్టారు. కేంద్రమంత్రి చిరంజీవి కూడా సీఎం పదవి పై ఒకరాయి విసిరారు. హైకమాండ్ అనుమతి ఇస్తే .. ముఖ్యమంత్రిగా చెయ్యటానికైన నేను రెఢీ అంటూ చిరంజీవి మీడియా ప్రకటన చేయటం జరిగింది.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పాలనను రాష్ట్రపతి చేతిలో పెట్టడం కంటే కొత్త సీఎం చేతిలో పెట్టడం మంచిదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. అందుకు సీమాంద్ర ప్రాంతానికి చెందిన నేతనే సీఎంను చేస్తే ..కాంగ్రెస్ పార్టీకి మంచిదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగానే.. కేంద్ర మంత్రి చిరంజీవి , పీసీసీ బొత్స, మంత్రి కన్నా, మంత్రి ఆనం పేర్లను తెరపైకి తేవటం జరిగింది.
ఇప్పటికే రెడ్డి వర్గం తో కాంగ్రెస్ పార్టీకి బాగా అనుభవమైంది. ఈసారి రెడ్డి వర్గాన్ని దూరంగా పెట్టి, సీమాంద్ర లో సామాజిక వర్గానికి చెందిన కాపులపై కాంగ్రెస్ హైకమాండ్ ద్రుష్టి పెట్టింది. ఈరోజు ఢీల్లో ఇరుప్రాంతాల నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు.
ఈ చర్చలు అనంతరం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రులు అంటూ.. ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొదట కేంద్ర మంత్రి చిరంజీవి , మంత్రి కన్నా పేర్లు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి.
దీనితో సీఎం పదవిని భర్తీ చేయాలని అధిష్టానం ఆలోచిస్తోంది. సీఎం పదవి చిరంజీవికి కట్టబెడుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కల్పించేందుకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా స్వీకరించేందుకు నేను దేనికైన రెఢీ గా చిరంజీవి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో .. కేంద్ర మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తోనే చిరంజీవి కి సీఎం పదవి ఇచ్చిన ఆశ్చర్యంలేదని.. కాంగ్రెస్ ఫార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఈరోజు దిగ్విజయ్ సింగ్ కూడా చిరంజీవితో .. రాబోయే ఎన్నికల గురించి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఏమైన ఆంద్రప్రదేశ్ కు చివరి సిఎం ..చిరంజీవి పేరు ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్లు సమాచారం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు మాయం చేసేందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచరం.
కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కావాలనే అభిమానుల కోరిక కూడా త్వరలో తీరబోతుందన్నమాట.. (కాంగ్రెస్ పార్టీ లో చివరి నిమిషంలో మార్పులు కూడా జరగవచ్చు)
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more