కారు ఎన్నికల గుర్తుగల తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ అధినాయకుడు కె చంద్రశేఖరరావుకు సొంత కారు లేదని ఆయన సమర్పించిన ఎన్నికల నామినేషన్ తో ఇచ్చిన అఫిడవిట్ తెలియజేప్తోంది.
అయితే బేఫికర్, బేమతలబ్, బేయిమాన్ అన్న రీతిలో కారులేదు కాబట్టి బేకార్ అని అనగూడదు, దానికి వేరే అర్థమొస్తుంది అంటున్నారు హిందీ బాగా తెలిసినవాళ్ళు.
కెసిఆర్ ఆస్తుల వివరాలు ఇవి-
నగదు- తన పేర 9.90 లక్షలు, తన భార్య పేర 1.50 లక్షల రూపాయలు.
బంగారం- 710 గ్రాములు ఆభరణాల రూపంలో. విలువ సుమారు రూ. 21.30 లక్షలు.
చిరాస్తులు- ఎర్రవల్లిలో 37 ఎకరాల 70 గుంటలు. దాని విలువ సుమారు రూ.91.78 లక్షలు. మార్కెట్ విలువు రూ.4.50 కోట్లు. మిట్టపల్లిలో రూ.50 లక్షల మార్కెట్ విలువ గల 2 ఎకరాల 4 గుంటలు. హైద్రాబాద్ బంజారా హిల్స్ లోను, కరీం నగర్ జిల్లా తీగలగుట్టలోను నివాస భవనాల విలువ సుమారు రూ. 3.65 కోట్లు.
పెట్టుబడులు- తెలంగాణా బ్రాడ్ కాస్టింగ్ ప్రై లిమిటెడ్ లో 55 లక్షల రూపాయలు, తెలంగాణా పబ్లికేషన్స్ ప్రై లిమిటెడ్ లో 4.16 కోట్ల రూపాయలు, హిమాంశు మోటార్స్ ప్రై లిమిటెడ్ లో రూ.ఒక లక్ష రూపాయల విలువైన షేర్లు.
వసూలు కావలసిన ఋణాలు- ఒక కోటి రూపాయలు.
2012-13 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయం రూ.6.59 లక్షలు.
బ్యాంక్ లు ఆర్థిక సంస్తలకు తీర్చవలసిన ఋణాలు- రూ.7.87 కోట్లు.
ఇన్నీ ఉన్నా కెసిఆర్ కి ఆయన పేరు మీద సొంత కారంటూ లేదు. అయితే ఇది కేవలం హాస్యోక్తిగా చెప్పుకోవటానికే కానీ ఎన్నికల చిహ్నాలతో నాయకులకు ఏ సంబంధమూ ఉండదు. కేవలం వ్యాఖ్యానాల్లో వాటిని ఉపయోగిస్తుంటారు. కమలం సైకిలెక్కిందని, కారు హస్తంతో పొత్తు పెట్టుకోలేదని, సైకిల్ నుంచి కారులోకి జంప్ అయ్యారని ఇలా వ్యాఖ్యాతలు వాడటం కద్దు!
అయితే భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఇలా తీవ్రస్థాయిలో ఉపయోగించగా ఎన్నికల కమిషన్ ఒకసారి ఆయనను హెచ్చరించింది. హస్తం గుర్తు గల కాంగ్రెస్ పార్టీ గురించ్ మాట్లాడుతూ అది ఖూనీ పంజా- అంటే హత్య చేసే చెయ్యి అని మోదీ విమర్శించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more