కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత దిగ్విజయ్ లవ్ రొమన్స్ తో .. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు తలలు పట్టుకున్నారు. ఎవరు ఏం మాట్లాడితో ఏం సంబంధం అంటుకుంటుందోనని మీడియాకు దూరం దూరంగా ఉంటున్నారు. అయితే ఢిగ్గీ మాత్రం ఏదో ఒలంపిక్ లో గోల్డ్ మోడల్ సాధించిన ఆటగాడు మాదిరి మీడియా ముందు గర్వంగా తన చీకటి ప్రేమయాణం గురించి చెప్పటంతో పాటు.. మోడీ పెళ్లి కి ముడిపెట్టి అందరి లో నవ్వులపాలైనట్లు తెలుస్తోంది.
ఢిగ్గీ రాజా చిలకొట్టుడు చేష్టలు , నోటి దూలతో ..కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కు వచ్చి పడిందని ..ఆ పార్టీ నేతలు.. డీగ్గీ రాజా నడి నెత్తిపై ముట్టికాయాలు వేస్తున్నారు. అంతేకాకుండా మోడీ తన బాల్య వివాహాన్ని 30 సంవత్సరాల పాటు రహస్యంగా దాచి పెట్టాడు. కానీ నేను అలా కాదు.. నా ప్రేమ విషయాన్ని అందరి తెలియజేశానని ‘‘ఊడిపోవటానికి సిద్దంగా ఉన్న పళ్లతో బోసి బుగ్గలపై రొమాన్స్ నవ్వులు పూయించాడు.’’ దీంతో.. డిగ్గీ ప్రేమాయణం పై మహిళ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయినా దిగ్విజయ్ సింగ్ .. నవ యువకుడు కాదు, నడి వయుసోడు కాదు, చివరి రోజులకు దగ్గరవుతున్న సినీయర్ సిటిజన్. కానీ సిటిజన్ వయసులో కూడా సిగ్గుపడకుండా. నడి వయసు ఉన్న అమృతా రాయ్ తో అర్థరాత్రి అష్టాచమ్మా ఆడినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
దీంతో కాంగ్రెస్ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఈ అంశం వ్యక్తిగతమైంది. దాన్ని మరీ భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కాకపోతే ఎదుటి వారి గురించి అదే పనిగా ప్రశ్నించే డిగ్గీ రాజా., ఇంకా విడాకులు పొందని మహిళతో 'క్లోజ్'గా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తెచ్చాయని సీనియర్ నేతలు అంటున్నారు.
అయిన ఎంతో రహస్యంగా కొన్ని నెలల నుండి సాగుతున్న ఢిగ్గి రాజా సీక్రెట్ సంసారం ఎలా బయట పడింది? అసలు వారి ఫోటోలను సోషల్ మీడియా ఎవరు పెట్టారు? దేని కోసం ఇదంతా చేస్తున్నారు? అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. అమృతా రాయ్ పర్సనల్ కంప్యూటర్ నుంచి ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి అనే ప్రశ్న కాంగ్రెస్ నేతలను బాధిస్తుంది. దీంతో కొంతమంది డిగ్గీ పర్సనల్ వ్యక్తులు రంగంలోకి అసలు విషయాన్ని చేదించారు.
ఢిగ్గీ రాజా ఆనంద డోలికలలో తేలిపోతున్న సమయంలో తమ తీపి గుర్తు కోసం, తమ సంబంధం బయటపడే అవకాశం లేదనిభావించి, సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలను అమృతా రాయే తీసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ టీవీలో యాంకర్. గా ఉన్న సమయంలో డిగ్గీతో సరసం సాగించినట్లు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు..
అలా దిగిన ఫోటోలను అమృత తన కంప్యూటర్లో చాలా భద్రంగా పెట్టుకున్న సమాచరం. అయితే సరిగ్గా .. ఇక్కడే.. అమృతా రాయ్ చాలా జాగ్రత్త పడింది. ఢిగ్గీ రాజా లాంటి వ్యక్తితో పడక సుఖం అంటే చాలా డెంజర్ అని గుర్తించి, ముందు జాగ్రత్త కోసమే.. ఇలా చేసి ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు..
ఇదే సమయంలో అమృతా రాయ్ లో సరికొత్త ఆలోచన మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నాళ్లు ఇలా చీకటి రొమాన్స్ చేసుకుంటూ .. ఉండాలి? తన దగ్గర ఉన్న ఫోటోలను బయట పెడితే.. ఢిగ్గీరాజాతో.. పబ్లిక్ గా రొమాన్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది, సమాజంలో డిగ్గీరాజా రెండో భార్యగా అందరు గుర్తిస్తారు? ప్రత్యేక సెలబ్రిటీ వస్తుందని ఉద్దేశంతోనే.. ఫోటోలను బయట పెట్టి, డిగ్గీరాజాకు అమృతా రాయ్ జలక్ ఇచ్చినట్లు గా ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
అమృతా రాయ్ సరైన సమయం చూసి, డిగ్గీరాజా తో దిగిన ఫోటోలను .. సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలుస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.. ఇలాంటి విషయం పై టీవీ యాంకర్ అమృతా రాయ్ ముందు జాగ్రత్తగా ఒక సమాధానం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘తన కంప్యూటర్ ను ఎవరో హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ దొంగలించారని అమృత చెబుతోంది ’’ సరిగ్గా ఇక్కడే అందరికి అనుమానం మొదలైందని. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు చెవులుకోరుక్కుంటున్నారు. . (ఇది నిజమని ఖచ్చితంగా చెప్పలేం).
ప్రస్తుతం వీరు మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తే ఫోటోలు పొరపాటునే బయటకు వచ్చి ఉంటాయని కొంత మంది కాంగ్రెస్ నేతలు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. . అందువల్ల ఈ అంశంలో డిగ్గీని, అమృతను కూడా తప్పుబట్టలేం. కాకపోతే డిగ్గీకి ఉన్న స్థాయి కారణంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని మనం చర్చించుకోవాల్సి వస్తోంది.
అంతేగానీ ఇదే పనిగా డిగ్గీరాజా రొమాన్స్ గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు? సమాజంలో.. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి.. ఇది వారి పర్సనల్ లైఫ్ కాబట్టి ..మనం కొంచెం దూరంగానే చూద్దాం. ఏమైన చర్యలు తీసుకుంటే. డిగ్గీరాజా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది..
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more