తెలంగాణలో కారు ఫలితాలు ఘనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీమాంద్ర లో కాబోయే సీఎం ఎవరైన కేసిఆర్ చెప్పినట్లు వినాల్సిందరేనట? కేసిఆర్ ఇప్పటికే చిన్నజీయర్‌స్వామి లను కోలుకోవటం జరిగింది. జరగబోయే భవిష్యత్తు గురించి స్వామి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లోని రాజకీయ రంగులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో ఎప్పటి నుండి అధికారం కోసం వేచి చూస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కారు వేగం బాగా పెంచాడు. దీంతో ఆయన పార్టీకి తిరుగులేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ సర్వేల ఫలితాలను తెలుసుకున్న కేసిఆర్ ఆధికారం రాబోతుందన్న ఆనందంలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయితే సార్వత్రిక ఎన్నికల వెల్లడి కావటానికి .. మరో పది రోజులనే సమయం ఉంది. ఇటు సీమాంద్రలోను, అటు తెలంగాణలోను రాజకీయ పార్టీ లు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ విభజన పై దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మే 15న తేదీ వరకు విభజన ప్రక్రియ పూర్తి జరగాలని గవర్నర్ అధికారులకు సూచించారు. ఇక తెలంగాణలో కేసిఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరికి అర్థమైంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి నివాసం, అధికారిక కార్యాలయం లాంటి అంశాలపై ఇప్పటికే గవర్నర్ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఒకే వేళ తెలంగాణలో కేసిఆర్ పార్టీ అధికారంలోకి వస్తే , గవర్నర్ తీసుకున్న నిర్ణయాలకు కొంచెం విలువు తగ్గిపోతుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
అదే కనుక జరిగితే.. తెలంగా; సీమాంద్ర ముఖ్యమంత్రులు ఏయే కార్యాలయాలు కేటాయించాలి? వారికి అధికారిక బస ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటికే అధికారులు ఒక నిర్ణయానికి రావటం జరిగింది. కానీ ఆ అధికారులు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే బాధ్యత కేవలం తెలంగాఱ ముఖ్యమంత్రికే ఉంటుందన్న విషయాన్ని కేసిఆర్ గ్యాంగ్ గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం అధికారులు ప్రాధిమికంగా నిర్ణయాలు తీసుకున్నా.. అంతిమంగా ఆ నిర్ణయాల్ని ఆమోదించేది తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే తప్ప మరొకరు కాదన్న విషయాన్ని వారు టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో కేసిఆర్ అన్ని వాస్తు ప్రకారమే నడుచుకుంటాడని అందరికి తెలుసు. వాస్తును నమ్మె కేసిఆర్ .. అధికారులు కేటాయించే కార్యాలయాల్ని ఎలా తీసుకుంటారు? ఆయన తన నమ్మిన వాస్తు ప్రకారమే ముందుకు సాగిపోతారు.
ఈ విషయం టీఆర్ఎస్ భవనం వాస్తు విషయలోని బయటపడింది. గుడి నీడ పార్టీ ఆఫీసు మీద పడటంతో కష్టాలు వస్తాయని నమ్మి, వెంటనే.. ఆ గుడి నీడ .. టీఆర్ఎస్ భవనంపై పడకుండా ఎతైన గోడ నిర్మించిన విషయం అందరికి తెలుసు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. కేసిఆర్ అన్నీ భవనాలకు, ముఖ్యంగా సీఎం అధికారిక నివాసం , కార్యాలయలకు వాస్తు విషయం ఆచచి తూచి అడుగులు వేయటం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు.
పదేళ్లు పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పడికి ..కేసిఆర్ హవా బాగానే ఉంటుందని రాజకీయ నేతలు అంటున్నారు.
సమయంలో.. సీమాంద్ర నుండి ఎవరు ముఖ్యమంత్రి అయిన , కేసిఆర్ చెప్పినట్లు వినాల్సిందే, ఆయన ఎక్కడ కూర్చోమంటే.. అక్కడ కూర్చోవాలి. అంటే తెలంగాణకు ముఖ్యమంతి అయ్యే 99 శాతం కేసిఆర్ కే ఉన్నాయి కాబట్టి, సీమాంద్ర ప్రాంతానికి కావాల్సిన కార్యాలయాలు .. ఎక్కడ ఉండాలని అన్ని డిసైడ్ చేసేది .. తెలంగాణ తొలి ముఖ్యమంత్రే అని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.
సీమాంద్రకు .. జగన్, చంద్రబాబు సీఎం అయిన.. కేసిఆర్ తో మాత్రం మైత్రి సంబంధం కలిగి ఉండాల్సిందే. అందుకే ఈ ముగ్గురు ముద్దు ముద్దుగా రాజకీయ విమర్శలు చేసుకున్నారు కాబోయే ముఖ్యమంత్రులు.. కారు, ఫ్యాన్ , సైకిల్
తెలంగాణలో కారు జోరుగా తీరుతుంది. ఇక సీమాంద్రలోని, సైకిలా, లేక ప్యానా? అనేది త్వరలో తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more