రాష్ట్ర గవర్నర్ నరసింహన్ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న జరిగినలో అవమానించారని. తెలంగాణ తెలుగుదేశపార్టీ తమ్ముళ్లు అంటున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చంద్రబాబు పై చూపిన వైఖరే ఇందుకు కారణమని అంటున్నారు.
జూన్ 8వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ నరసింహన్ ఆద్వర్యంలో జరిగింది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి ఒక విధంగా, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరోవిధంగా అభినందనాలు తెలపటంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గవర్నర్ రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులు ఒకటే అనే భావం లేకుండా ఇద్దరు వేరు వేరు ప్రాంతాలు అనే విధంగా ఆయన ప్రవర్తించారని సైకిల్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మే 27న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. గవర్నర్ నరసింహన్.. చాలా అద్బుతంగా కేసిఆర్ కు అభినందనలు తెలిపారు.
ఆ సమయంలో.. పింక్ రంగు కలిగిన గులాబీ బుకే నే ఇవ్వటం, తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు, నేతలు ఆనందం వ్యక్తం చేశారు. అంటే గవర్నర్ కూడా టీఆర్ఎస్ (కేసిఆర్) పార్టీ పై అభిమానం ఉందని రుజువు చేసుకున్నారని తెలంగానేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ అసెంబ్లీ లో రెండు సార్లు గవర్నర్ నరసింహన్ పై ..టీఆర్ఎస్ నేతలు దాడి చేసినప్పటికి.. ఆయనకు గులాబీ దళం పై ప్రేమ తగ్గలేదని ..టిటిడిపి తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గవర్నర్ నరసింహన్ ..పసుపు రంగు కలిసిన గులాబీల మద్యలో.. కొన్ని రెడ్ గులాబీలు, కొన్ని పచ్చఆకులు కలిగిన ఉన్న బుకే ఇచ్చి అభినందనాలు తెలిపారు. ఇప్పుడు అదే తెలంగాణ తమ్ముళ్లకు నచ్చలేదు. ఆరోజు కేసిఆర్ కు అన్నీ పింక్ రంగు కలిగిన గులాబీ బుకే ఇచ్చి, ఈ రోజు చంద్రబాబుకు మూడు రంగుల కలిగిన బుకే ఇవ్వటం వెనక , తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును తీవ్రంగా అవమానించారని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
చంద్రబాబు పై గవర్నర్ కు ఇంత పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారని సైకిల్ అభిమానులు గవర్నర్ ను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు కూడా అన్నీ పసుపు రంగు గులాబీలు కలిగిన బుకే ఇస్తే గవర్నకు ఏమవుతుంది. గవర్నర్ నరసింహన్ కావాలనే చంద్రబాబును అవమానించారని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ సైకిల్ తమ్ముళ్లు ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయం పై అసెంబ్లీలో తెల్చుకోవటానికి సిద్దమవుతున్నట్లు పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఏమంటారో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more