నెల్లూరు ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆనం బ్రదర్స్ మీడియా ముందుకు వస్తే పంచ్ డైలాగులకు కొరతే ఉండదని మీడియా వర్గాలు అంటున్నాయి. సీమాంద్రలో చచ్చుబడిపోయిన చేతిని లేపటం చాలా కష్టమని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు త్వరగానే గుర్తించారు. అందుకే జాతీయ చేతికి హ్యాండ్ ఇచ్చి, లోకల్ పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే గోడ దూకే నేతలు ముందుగా కొన్ని లీక్ లు వదులుతారు. అప్పటి వరకు కొనసాగిన పార్టీలపై గ్యాస్ వదలటం చాలా సహజంగా జరుగుతుంది. గత రెండు రోజుల నుండి ఆనం బ్రదర్స్ , సీమాంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో.. రాత్రి వేళ రహస్య చర్చలు, సైకిల్ వెళ్లటానికి చంద్రబాబును లిప్ట్ అడిగినట్లు సమాచారం. అయితే ఆనం బ్రదర్స్ రాకను.. పార్టీలోని సీనియర్ నాయకులు రాంగ్ బెల్ మ్రోగిస్తున్నారు. ఆనం అభిమానులు మాత్రం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి సందర్భంలో.. ఆనం వివేకానంద రెడ్డి మీడియా ముందుకు రావటం పెద్ద హాట్ టాఫిక్ గా మారింది. ఒక్క పక్క ఆనం బ్రదర్స్ ఇద్దరు సైకిల్ ఎక్కుతున్నారనే వార్తలు వస్తున్న సమయంలోనే, ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ నేతలు, మీడియా వర్గాలు షాక్ తిన్నాయి. ఈ సమయంలోనే ఆనం వివేకానందరెడ్డి తనలో ఉన్న ఫంచ్ డైలాలను కాంగ్రెస్ పార్టీ నేతలపై వదిలాడు.
ఒకరకంగా చెప్పలంటే.. ఆనం వివేకాందరెడ్డి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పెద్దల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ నాశనం కావటానికి కారణం, డిక్కీ డక్కా రాజాలు కారణమని పరోక్షంగా దిగ్విజయ్ సింగ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. అంతేకాకుండా పెళ్లి కానీ నాయకుడితోనే..కాంగ్రెస్ పార్టీ దేశంలో నాశనం అయిందని, వయసు ముదిరిన నేతలు రెండేసి పెళ్లిళ్లు చేసుకోవటంతోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం దగ్గకుండా పోయిందని వివేకా కాంగ్రెస్ పెద్దల దుమ్ము దులిపేశాడు.
ఇలాంటి బఫూన్లను కాంగ్రెస్ హైకమాండ్ తొక్కేయాలని గట్టిగా సూచించారు. మరోపక్క అవినీతి మంత్రులకు కాంగ్రెస్ పార్టీ అడ్డగా మారిందని, కొంతమంది మంత్రులపై వివేక్ విమర్శలు చేయటం జరిగింది. అంతేకాకుండా కొంతమంది మంత్రులు కాంగ్రెస్ పార్టీలో కోట్లు సంపాదించుకొని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అదుకోవాల్సిన వారే..మరో పార్టీలో చేరి రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని వివేక్ అన్నారు.
అయితే అక్కడే ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు .. ఈ అన్నదమ్ములు కూడా త్వరలో బాబు సైకిల్ ఎక్కటానికి సిద్దంగా ఉన్నారు కదా అనగానే.. వెంటనే వివేక్ ..ఆవేశంగా..‘‘నీరు ఎఫ్పుడు పల్లం వైపే వెళ్లుతుంది’’ అలాగే మన రాజకీయ నాయకులు కూడా అధికారం ఉన్న చోటుకే వెళ్లటం సహజంగా జరుగుతుందని ఇందులో పెద్ద తప్పులేదని చెప్పి, అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో వివేక్ లో. ఆవేశంతో పాటు.. ఆలోచనకూడా లేదని అందరికి అర్థమై ..సైలెంట్ గా.. నవ్వుకున్నారు.
ఇలాంటి బఫూన్లను కాంగ్రెస్ హైకమాండ్ తొక్కేయాలని సూచించారు. అంటే ఆ బఫూన్ల లిస్టులో.. ఆనం బ్రదర్స్ కూడా ఉన్నట్లు కదా అని ..కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటే అక్కడి నుండి వెళ్లిపోయారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more