రాజకీయ పదవి కోసం కాదు..! ప్రశ్నించటం కోసం వస్తున్నా..! అని జనసేన పార్టీ అధినేత కె. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఒక సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజలు పవన్ ప్రశ్న కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై కొంత మంది రాజకీయ నాయకులు కొన్నివిమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్న వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
అసలు పవన్ కళ్యాణ్ ప్రశ్న రావాలంటే.. మేము ఒప్పుకోవలని పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. అంతేకాకుండా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రశ్న పై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. పవన్ ప్రశ్న రాదని పోలిటికల్ నాయకులు బెట్టింగ్ పెడితే, జనసేన అభిమానులు మాత్రం పవన్ ప్రశ్న వస్తుందని భారీగా బెట్టింగు పెట్టినట్లు మార్కెట్లో చర్చలు జరుగుతున్నాయి.
అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్రశ్న ఎందుకు రావాలని కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. అసలు పవన్ ఏ రాజకీయ పదవి లేదు. ఏ హోదాలో ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తారు చెప్పండని అతివాదులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పవన్ ప్రశ్న కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారా? అంటే అది 1000 శాతం ఎదురుచూస్తున్నారని కొన్ని సర్వేలు, కొన్ని మీడియా లు చెబుతున్నాయి.
పవన్ దేనికి గురించి ప్రశ్నించాలి? అంటే..ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. బిజేపి ప్రభుత్వం, నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఒక్కసారి మావైపు చూడమని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే.. ఏ రాజకీయ పదవి ఆశించకుండా.. ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీ పెట్టి, రెండు రాజకీయ పార్టీలోకు తన మద్దతు తెలిపిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది. ఆ సమయంలో ప్రజలకు ఒక ఆయుదం ఇవ్వటం జరిగింది. అదే పవన్ ప్రశ్న.
ముగ్గురు గడ్డం బాబులు కలిసి. దేశ ప్రజలకు హమీల భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు గడ్డం బాబులు రాజకీయ పదవి తీసుకున్నారు. ఒక గడ్డం బాబు మాత్రం ..తన సినీ జీవితం పై దృష్టి పెట్టారు. కానీ ప్రజలు మాత్రం సినీబాబును ఇచ్చిన ప్రశ్న అనే ఆయుధాన్ని మరిచిపోలేదు. పవన్ ఒక్కసారి ఆ ఆయుదం పవర్ చూపించాలని కోరుతున్నారు. ఈరోజు మోడీ సర్కార్.. ప్రజలపై ధరల మోత మోగించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం పై కోటి ఆశలుపెట్టుకున్న ప్రజలకు .. వీపు విమానం మోత మోగింది.
దీంతో ప్రజలు చకోర పక్షుల మాదిరి .. పవన్ కళ్యాణ్ ప్రశ్న వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయమే బెట్టింగ్ రాయుళ్లు కు అవకాశం జరిగింది. మొన్నటి వరకు క్రికెట్ ఆట పై, ఎన్నికల సమయంలో రాజకీయ నేతల గెలుపు బెట్టింగులు పెట్టిన బాబులు బాగా లాభపడ్డారు. కానీ కొద్ది రోజులు వారి వ్యాపారం బాగా కుంటుపడింది. మోడీ ధరల పెంపుతో.. మళ్లీ బెట్టింగు రాయుళ్ల ఆట మొదలైంది.
దీంతో పవన్ కళ్యాణ్ ప్రశ్న పై భారీ బెట్టింగు పెట్టి ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రశ్న వస్తుందా..? రాదా? అని ఆశగా ప్రజలతో పాటు వీరు ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో పవన్ ప్రశ్న ప్రజల ముందుకు వస్తుందని .. ఆయన అభిమానులు బలంగా చెబుతున్నారు. పవన్ ప్రశ్న త్వరగా రావలని .. ఇప్పటికే.. కొన్ని చోట్లు ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు సమాచారం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more