ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన రాజకీయ శత్రవుల పై దృష్టి పెట్టినట్లు కనబడుతుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై బాబు లాంగ్ ద్రుష్టి పెట్టారు. దీంతో జగన్ కరెక్ట్ మొగుడిని రంగంలోకి దించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అసలు ఇంతకీ జగన్ మొగుడు ఎవరు? ఆయనకి జగన్ ఎందుకు భయపడతాడు? నిజంగా ఆయనంటే జగన్ కు భయమా? అంటే.. గతంలో జరిగిన విషయమే ఇందుకు ఉదాహారణ అని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబు కు మంచి సలహాదారుడి కోసం వేట సాగిస్తున్నాడు. బాబు వేటలో.. సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం రాష్ట్రానికి వచ్చిన లక్ష్మినారాయణ, చంద్రబాబుతో ప్రత్యేకంగా ఆయన నివాసంలో భేటీ అయినట్టు సమాచారం. ఈ భేటీ అరగంటకు పైగా సాగిందని తెలుస్తోంది. తన కార్యాలయంలో కీలక సలహాదారుడిగా రావాలని సీఎం చంద్రబాబు లక్ష్మీనారాయణను కోరారని.. అందుకు మాజీ జేడీ కూడా అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది.
అన్నీ అనుకూలిస్తే మాజీ జేడీ లక్ష్మినారాయణ వచ్చేవారంలోనే చంద్రబాబు సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. లక్ష్మీనారాయణ గతంలో వైఎస్ జగన్ ఆస్తుల కేసుతోపాటు ఓబుళాపురం మైనింగ్ గనులు, ఎమ్మార్ విల్లాల్లో అక్రమాలలాంటి కీలక కేసులను విచారించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. .
ఏపీలో ఐఐటీ, నిఫ్ట్, ఐఐఎం, ట్రిబుల్ ఐటీ, పెట్రోలియం యూనివర్శిటీ, గిరిజన వర్శిటీ, లా యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వాటి విషయంలో కీలకంగా పనిచేసే మీలాంటి వారు కావాలన్నది తమ సంకల్పమని చంద్రబాబు లక్ష్మీనారాయణతో అన్నట్టు సమాచారం. సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాపరంగా అగ్రగామీగా కావాలన్నదే తన సంకల్పమని, ఈ లక్ష్యసాధనకు తాను అనునిత్యం కృషి చేస్తానని లక్ష్మీనారాయణ చంద్రబాబుతో చెప్పినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు , జేడి లక్ష్మీనారాయణ కలిస్తే.. జగన్ కు చెమట్లు పట్టడం ఖాయమని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఒక పక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అవినీతి సొమ్ము తిన్న నల్ల కుబెరులకు నిద్రలేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు , నరేంద్రమోడీ, చంద్రబాబు, జేడి లక్ష్మీనారాయణ కలిసి ప్రభుత్వంలో పనిచేస్తే.. జగన్ కు మళ్లీ కృష్ణజన్మస్థలం దక్కుతుందని రాష్ట్రంలోని చదువుకున్న యువకులు అంటున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు .. సీమాంద్రలో జేడి లక్ష్మీనారాయణకు అభినందనలు తెలుపుతూ కొన్ని ప్లేక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. జగన్ కు కరెక్ట్ మొగుడు జేడి లక్ష్మీనారాయణ అని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చంద్రబాబు.. పద్మవ్యూహం నుంచి జగన్ ఎలా తప్పించుకుంటాడో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more