Telangana cm kcr attitude

kcr, kcr government, telangana, kcr family, kodandaram, telangana movement, telangana protests, trs, trs party, telangana news, telangana government, telangana cabinet, telangana latest, telangana ministers list, latest news

telangana chief minister kcr attitude is different from others he always have political plans on his mind : rumors that kcr uses persons and throws away but at the same time he also pickup the perosons with him

ఇదేమి వైఖరి అంటున్నారంతా... !!

Posted: 10/07/2014 09:22 AM IST
Telangana cm kcr attitude

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అటు ఉద్యమంలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన సంస్థలు కూడా ముఖ్యమంత్రి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమపట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ తో పాటు అనేక సంస్థలు ఉద్యమంలో పాల్గొన్నాయి. తెలంగాణ జేఏసీ వంటి సంస్థలు మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా మారాయి. జేఏసీ మార్గదర్శకంలో అంతా ముందుకు వెళ్ళి ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.., రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ వైఖరిపైనే అంతా విమర్శలు చేస్తున్నారు.

ఉద్యమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ గా కోదండరాం కీలక భూమిక పోషించారు. ఉద్యమ నేతగా., ఉద్యమంలో కేసీఆర్ తో సమాన హోదా కలిగిన వ్యక్తిగా మెలిగారు. ఎన్నో పోరాటాలు, ప్రసంగాలు చేశారు. చాలాసార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్ళారు. కేసీఆర్ పార్లమెంటులో తెలంగాణకోసం నినదిస్తే.., కోదండరాముడు తన సైన్యంతో పార్లమెంటు బయట ఢిల్లిలో లొల్లి చేశారు. ఉద్యమంలో ఇంత క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తికి చివరకు మిగిలింది ఏమిటి అంటే.., కేసీఆర్ చేతిలో అవమానమే అని అంతా అంటున్నారు. ఎందుకంటే ఉద్యమం సమయంలో బొమ్మ బొరుసులా కలిసి తిరిగిన ఇద్దరూ ఇప్పుడు కనీసం కలుసుకోవటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక కోదండరాంను కేసీఆర్ పక్కనబెట్టారు. కేబినెట్ లోకి తీసుకుంటారు. ప్రత్యేక సలహాదారు పదవి ఇస్తారు అని అనేక ఊహాగానాలు వచ్చాయి. కాని చివరకు ప్రమాణస్వీకారంకు ప్రత్యేక ఆహ్వానం కూడా వెళ్ళలేదట.

ఇది ఇలా ఉంటే.., మరికొంతమంది పట్ల కేసీఆర్ అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. ఉదాహరణకు నాయిని నర్సింహ్మరెడ్డి పార్టి తొలి రోజుల నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. అందుకు గౌరవంగా ఆయనకు హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సి కాకపోయినా.., హోదాను ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సి పదవిని కూడా అందించారు. ఇలా ఒకరి పట్ల అమితమైన ప్రేమను చూపుతూ అదే సమయంలో మరొకరిని కనీసం పట్టించుకోవటం లేదు. ఈ వైఖరిని దగ్గరినుంచి చూస్తున్నవారంతా ఇదెక్కడి మనస్తత్వం అని అనుకుంటున్నారట. సారు అసలు ఏం చేస్తారో ఎవరికి తెలియదు అని తలలు పట్టుకుంటున్నారట అంతా. ఇంతకీ కోదండరాం లాంటి నేతలను పక్కనబెట్టడం వెనక ఉన్న మతలబు ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలి.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  attitude  telangana  latest news  

Other Articles