తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 66 కోట్ల రూపాయలకే నాలుగేళ్ల జైలు, 100 కోట్ల రూపాయల జరిమానా విధించడంపై టీడీపీ నేతలు ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేశారు. జయలలితకు నాలుగేళ్లయితే.. మీకు నలబై ఏళ్లు తప్పదంటూ జగన్ పై సెటైర్లు వేశారు. గత నెల 27న జయలలిత జైలుకెళ్లిన మరుక్షణం నుంచి హుదూద్ తుపాను విలయం సృష్టించే వరకు టీడీపీ నేతలకు, మంత్రులకు జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడమే పనిగా మారింది.
తమ పనేదో తాము చూసుకుంటారు అని ముద్రపడిన మంత్రులు కూడా జగన్ ను టార్గెట్ చేసి వెల కోట్ల రూపాయల జరిమానా.. ఏళ్ల పాటు జైలు తప్పదని విమర్శలు గుప్పించారు. కర్ణాటక హైకోర్టు జయలలిత బెయిల్ ను తిరస్కరించిన సమయంలో.. అధికార పక్ష టీడీపీతో పాటు స్వంత పార్టీ వైసీపీలోనూ అందోళన మొదలైంది. జయలలితకు బెయిల్ రాలేదు.. మరి అక్రమాస్థుల కేసులో జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే.. బెయిల్ ఎలా వస్తుందన్న దిగులు పార్టీ నేతల్లో ప్రారంభమైంది. న్యాయశాస్త్ర కోవిదుడు, తల పండిన మేధావైన రాంజఠ్మాలనీ వంటి న్యాయవాదితోనే పని జరగలేదంటే.. ఇక జయకు బెయిల్ రాదని అన్నా డీఎంకే పార్టీ నేతలు, ఇటు తమ పరిస్థితిని తలచుకుని వైసీపీ నేతలు తలపట్టుకున్నారు.
ఆ సమయంలోనే జగనన్న వదిలిన బాణం, రాజన్న కూతరు షర్మిలను తెలంగాణ పార్టీ వ్యవహారాల అధ్యక్షురాలిగా జగన్ నియమించారని కూడా వార్తలు వచ్చాయి. తన కేసుల విచారణకు వచ్చి.. జైలుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తే..ఆంధ్రప్రదేశ్ లో తన తల్లి విజయమ్మ, తెలంగాణలో సోదరి షర్మిల పార్టీని నడుపుతారన్న నమ్మకంతోనే జగన్ వారిని నియమించారని పుకార్లు షికార్లు చేశాయి.
మరి ఇప్పడు జయలలితకు బెయిల్ లభించింది. అది కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే. సాధారణ షరతులతో కూడిన బెయిల్ ను జయలలితకు అత్యున్నత కోర్టు మంజూరు చేసింది. దీనిపై ఇప్పడు అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు. జయలలితకు బెయిల్ వచ్చింది.. మీకు వస్తుంది అంటూ జగన్ ను టార్గెట్ చేస్తారా..? లేక జయమ్మ వచ్చింది కానీ.. మీకు మాత్రం రాదు అంటారా..? అక్రమాస్థుల కేసులో 2013లో వచ్చిన ఉప ఎన్నికలకు ముందు మే 27న రిమాండ్ ఖైదీగా జైలుకెళ్లిన జగన్ ఆ తరువాత 16 మాసాలకు సెప్టెంబర్ 24న జైలు నుండి బయటకు వచ్చారు. విచారణ జరిగిన తరువాత కూడా జయలలిత తరహాలో బయటకు వస్తారని వైసీపీ కార్యకర్తలు ధమా వ్యక్తం చేస్తున్నాయి
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more