Telangana andhra pradesh government invites obama india tour

obama india tour, obama india tour schedule, obama visit hyderabad, obama visit andhra pradesh, telagnana invites obama, andhra pradesh invites obama, american embassy, telangana latest news updates, andhra pradesh updates, chandrababau naidu latest, modi on obama, republic day celebrations programmes

telangana andhra pradesh government invites obama india tour : telangana government invites obama to visit hyderabad during india tour, chandrababu also plans to request obama to visit andhra pradesh

తెలంగాణ- ఆంధ్రా వివాదంలో ఇరుక్కున్న ఒబామా

Posted: 12/02/2014 02:51 PM IST
Telangana andhra pradesh government invites obama india tour

దేశంలో చరిత్ర గల పార్టీలకే చెమటలు పట్టించిన ఘనత తెలంగాణ-ఆంధ్రా విభజన అంశానికి ఉంది. ఈ వ్యవహారం పరిష్కారం దేశంలోనే అత్యంత క్లిష్లమైనదని గత ప్రభుత్వ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా అంగీకరించారు. ఆత్మగౌరవం, సున్నితమైన భావోద్వేగాలకు రాజకీయ అ0శం తోడయితే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలందరూ చూశారు. అలా దేశాన్ని ఈ అంశం కుదిపేసింది. నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి కంటిమీద కునుకులేకుండా చేసింది. అలాంటి వివాదాస్పద విషయం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గరకు చేరింది.

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిధిగా ఒబామా హాజరవుతున్న విషయం తెలిసిందే. జనవరి 26న ఒబామా భారత్ వస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు కూడా ప్రకటించాయి. అగ్రరాజ్యంగా భావించే దేశాధినేత భారత్ కు వస్తుండటంతో.., ఆయన్ను రాష్ర్టానికి రావాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరుతోంది. ఒబామా హైదరాబాద్ లో పర్యటించాలని తెలంగాణ తరపున సీఎస్ రాజీవ్ శర్మ అమెరికా ఎంబసీకి లేఖ కూడా రాశారట. అయితే ఇంకా రిప్లై రాలేదు. మరోవైపు పెట్టుబడులు, రాజధాని కోసం దేశాలుపట్టి తిరుగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెల్లజాతి నల్ల అధ్యక్షుడిని ఏపీకి తీసుకెళ్ళాలని భావిస్తున్నారట. అయితే బాబుగారు ఇంకా లెటర్ రాయలేదు.

ఇలా రెండు రాష్ర్టాలు ఒబామాకు ఎల్లో.., పింక్ కార్పెట్లు పరిచి స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫర్ అంటూ తెలంగాణకు వస్తాడా.., లేక లాబీయింగ్ బాబు బుట్టలో పడి ఏపీకి వెళ్తాడా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీకి వెళ్తే తెలంగాణలోని ప్రతిపక్షాలు సర్కారును దుమ్మెత్తిపోయటం ఖాయం. అదే హైదరాబాద్ కు వచ్చారంటే.., బాబుకు కూడా సేమ్ సీన్ తప్పదు. అయితే కామన్ క్యాపిటల్ కాబట్టి సిటీకి వచ్చారు అని కవర్ చేసుకోవచ్చు. ఇంతకూ ఒబామా తెలుగు రాష్ర్టాల పర్యటనకు వస్తారా లేక.., వారినే ఢిల్లీకి వచ్చి కలిసి వెళ్లమంటారా.., రెండూ కాకుండా సారీ బాయ్స్ అని చెప్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama  india tour  telangana  andhra pradesh  republic day  

Other Articles