Ntr situations comes to kcr harish rao targets kcr

kcr poltical career, k chandra shekar rao, k taraka rama rao, kalvakuntla chandra shekar rao, telangana political situations, telangana recent news, telangana state news, telangana political damage, harish rao targets kcr, harish rao new party

kcr will face danger situations in politics in future

కెసిఆర్ కు కూడా ఎన్టీఆర్ దుస్థితే పడుతుందా...??

Posted: 12/19/2014 01:57 PM IST
Ntr situations comes to kcr harish rao targets kcr

అప్పుడు ఎన్టీఆర్ కొత్తగా పార్టీ పెట్టి, తెలుగు వారి ఆత్మ గౌరవం పేరుతో రాష్ట్రమంతా కలియ తిరిగి ఆ ఊపుతో అధికారం లోకి వచ్చి, ఇప్పుడున్న కొందరు ముఖ్య నేతలకు కూడా రాజకీయ ఆసరా ఇచ్చిన వ్యక్తని చాల మంది చెప్తూ ఉంటారు. తర్వాత తర్వాత జరిగిన పరిణామాలతో అధికారం నుండి దిగిపోవం.. తన అల్లుడే తన కొంపకి కుంపటి పెట్టటం జరిగిందని అప్పుడు రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి.  తను చేరదీసిన వారే తనను నిట్ట నిలువునా ముంచటం ఇంకా ఏదేదో జరగటం తదనంతర పరిణామాలకు దారి తీయటం తెలిసిన విషయమే.

ఇప్పుడు తెలంగాణా ప్రజల అభీష్టం మేరకు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు కెసిఆర్ కు నాయకత్వం అందిచటం జరిగింది. కాని ఆ అధికారం మున్నాళ్ళ ముచ్చట గానే మిగిలిపోనుందని కొన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. మొన్నటి మంత్రి వర్గ విస్తరణతో అది కాస్తః తేట తెల్లం అయినట్లు చెప్తున్నారు. సొంత పార్టీ నేతలు కాదు కనీసం తన కుటుంబసభ్యుల మాటనే తిరస్కరించాడని బయట చర్చించుకుంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ సందర్బంగా తన మేనల్లుడు హరీష్ రావు కెసిఆర్ సూచించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తే కార్యకర్తల్లో సమాధానం చెప్పుకోలేమని, పార్టీ కోసం కష్ట పడ్డ వాళ్ళకు పదవి ఇద్దామని చెప్పినట్లు కొన్ని వర్గాల భోగట్టా.  కాని ఆ మాటను కెసిఆర్ వినలేదని మంత్రివర్గ విస్తరణ లో నాకు ఎవ్వరి సలహాలు అవసరం లేదని చెపినట్లు పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయట...!! దాంతో హరీష్ రావు కొంత స్థబ్దు గా ఉన్నారని బయట అనుకుంటున్నారు.

ఏది ఏమైనా అప్పుడు తెలుగు వారి ఆత్మ గౌరవం తో అధికారంలోకి వచ్చి రాజకీయంగా సొంత వాళ్ళ నుండే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఎన్టీఆర్ కు వ్యక్తిగతంగా, రాజకీయంగా చివరకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇప్పడు కెసిఆర్ కు అదే పరిస్థితి ఎదురుకావచ్చని పలు వర్గాల వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తన కుటుంబ సభ్యుల్లో ఒకరు కొందరి ఎం.ఎల్.ఏ లను తన వైపుకు తిప్పుకున్నాడని, ఆ ఎం.ఎల్.ఏ లతో తన కంటూ ఒక గ్రూప్ ను నిర్వహిస్తున్నారని, ఎప్పుడు వ్యక్తిగత సమావేశం జరిగినా ఆ ఎం.ఎల్.ఏ లందరూ హాజరవుతుంటారని పార్టీ లోని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయట...!! తను ఎప్పుడు జెండా ఎత్తేసినా కాని ఆ ఎం.ఎల్.ఏ లందరూ తన వైపే ఉండే అవకాశం ఉందని దాంతో కెసిఆర్ ప్రభుత్వానికే పంచ్ పడే అవకాశం ఉంటుందని కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే జరిగితే కెసిఆర్ పరిస్థితి ఎం అవుతుందని బయట చర్చించుకుంటున్నారట...!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles