Will ktr solve chakri family problems

Ktr, Ktr in chakri death case, ktr involved chakri death, chakri death controversy, chakri death mystery, chakri death latest, chakri family, chakri wife, chakri wife sravani, sravani on chakri death, sravani, tollywood updates, telangana latest, telangana updates

will KTR solve Chakri death controversy : Chakri family met telangana minister ktr for solving problems. chakri death controversy will take new turn if KTR enters into matter. Sravani hopes that justice will come her side

చక్రి చిక్కుముడిని కేటీఆర్ విప్పుతాడా..?

Posted: 01/13/2015 04:28 PM IST
Will ktr solve chakri family problems

రోజుకో మలుపు తిరుగుతున్న చక్రి మరణం కొత్త టర్న్ తీసుకుంది. ఇంతకాలం చక్రి భార్య శ్రావణి, చక్రి కుటుంబ సభ్యుల మద్య ఉన్న వివాదం ఉన్న విషయం తెలిసిందే. చక్రిని నువ్వంటే నువ్వే చంపావని రెండు వర్గాలు మీడియా సాక్షిగా ఆరోపనలు చేసుకుంటున్నాయి. దీంతో సహజ మరణంపై రోజుకో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. పరస్పరం కేసులు, ఆరోపణలతో వివాదాలమయం అయిన ఈ అంశం చివరకు ప్రభుత్వం వద్దకు చేరింది. తమకు న్యాయం చేయాలంటూ చక్రి కుటుంబ సభ్యులు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కోరారు.

కోడలు శ్రావణి వల్లే చక్రి చనిపోయారనీ.., మరణంపై విచారణ జరిపంచాలని చక్రి తల్లి విద్యావతి మంత్రిని కోరింది. వీరి బాధలు విన్న కేటీఆర్ తగిన సాయం, న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. అయితే ఇది కేవలం మాట వరసగా చెప్పారా.., లేక నిజంగానే మంత్రి రంగంలోకి దిగుతారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కేటీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇప్పటికే మాజి ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నాడు అని ఆరోపిస్తున్న శ్రావణికి ఇది మరో ఆయుధం కానుంది. కేటీఆర్ వర్గీయులు ఒత్తిడి చేస్తున్నారు అని మీడియా ముందు చెప్తే.., ప్రతిపక్షాలకు అడ్డంగా బుక్ అయిపోతారు.

సున్నితమైన ఈ వివాదంలో యువ మంత్రి ఎలా న్యాయం చేస్తాడు.., అసలు ఏం చేస్తాడు అని చక్రి అభిమానులు ఎదురుచూస్తున్నారు. చక్రి మరణం, కుటుంబ వివాదాల చిక్కుముడులు విప్పలేక పోలీసులే తలలు పట్టుకుంటుండగా కేటీఆర్ ఎలా పరిష్కరిస్తాడు, ఎవరికి న్యాయం చేస్తాడు అని ఆసక్తి నెలకొంది. మరి కేటీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటాడా.., ఒకవేళ రంగ .ప్రవేశం చేస్తే శ్రావణి వైపు ఉంటాడా లేక, తల్లి వైపు నిలుస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chakri death  Sravani  KTR  

Other Articles