తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి పునాదులు ఏర్పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షలను ఎంపిక చేయడంలో రెండో పర్యాయం కూడా తప్పు చేసిందని... పీసీసీ అధ్యక్షుడికి సహకరించబోనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బహిరంగానే విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ... ఫార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారా..? అంటే కూడా జమేనన్న సంకేతాలు వస్తున్నాయి. మరి నూతనంగా ఏర్పాటు కానున్న రాజకీయ పార్టీకి పేరు కూడా ఖరారు చేశారా అంటే.. అది కూడా ఇంచుమించుగా అవుతున్నట్లు సమాచారం.
తెలంగాణలో అధికారంలో వున్న కేసీఆర్ ప్రభుత్వంలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత అందడం లేదని.. కాబట్టి తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించడంతో పాటు ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడంతో ప్రస్తుతం ఉన్న పార్టీలతో అయ్యే పని కాదని, ఈ నేపథ్యంలోనే నూతన పార్టీ స్థాపించాల్సిన అవసరంముందని వారు బావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజున ఒకరికోకరు తారసపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మద్య సాగిన అసక్తికరమైన చర్చ కూడా ఇందుకు పరోక్ష సంకేతాలను ఇస్తోంది.
తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ నాయకత్వాంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి.. కేసీఆర్ టీఆర్ ఎస్( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీకి కోదండరామ్ టీఆర్ఎస్ ( తెలంగాణ రెడ్డి సమితి) తో చెక్ పెట్టాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు కూడా. ఇందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్నారట వెంకటరెడ్డి. అయితే విషయం మీడియా చెవిన పడగానే లేదు లేదు అలాంటిదేమీ లేదని మాట దాటవేస్తున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డితో తనకు వ్యక్తిగత సమస్యలే కానీ రాజకీయ తగాదాలు లేవని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more