గత మూడు రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట సట్టారు. దాంతో మామూలు జనం పడరాని కష్టాలన్నీ పడుతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్లుగా అడిగినంత ఫిట్ మెంట్ ఇవ్వడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్దంగా లేవు. అయితే అసలు కథ మాత్రం వేరేలా ఉందని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచడానికే ఇలా కావాలని సమ్మెపై తొందరగా నిర్ణయం తీసుకోవడం లేదని అనుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకే వైఖరిని అవలంబిస్తున్నాయి. రెండు వైపులా కార్మికసంఘాలతో ఆయా ప్రభుత్వాలు జరుపుతున్న చర్చలు ఒకే విధంగా ఉన్నాయి. కొత్త రాష్ట్రాల్లో ప్రభుత్వం ప్రజలపై ఛార్జీల భారం మోపిందనే అపవాదును తప్పించుకోవడానికి కార్మికుల సమ్మెను ఆయుధంగా వాడుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాయట.
ఆర్టీసీ యాజమాన్యం 15 శాతం ఛార్జీల పెంపు ప్రతిపాదనల్ని చాలా కాలం క్రితమే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించిందట. దీన్ని అమల్లోకి తేవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సాహసించలేదు. ఇప్పుడు వారికా అవకాశం కార్మికుల సమ్మె రూపంలో వచ్చింది. నాలుగురోజులు సమ్మెను కొనసాగింప చేసి, ప్రజల్ని ఇబ్బందులపాలు చేసి, కార్మికుల కోర్కెల కోసమే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయట. ఇదే వ్యూహాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తుండటం గమనార్హం. ఫిట్‌మెంట్ కోసం ఎపిలో కేబినెట్ సబ్ కమిటీ అంటే తెలంగాణలో కూడా అదే పాట పాడుతున్నారు. తాజాగా 15 శాతం ఛార్జీల పెంపు ప్రతిపాదనల్ని 20 నుంచి 25 శాతానికి ఒకేసారి పెంచితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఎంట్రీట్యాక్స్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి గతంలోనే చెప్పారు. ఛార్జీలు పెంచకుండా కార్మికుల డిమాండ్‌ను పరిష్కరించడానికి ఈ టాక్స్‌లో నుంచి ప్రభుత్వం కేటాయించవచ్చు. కానీ వచ్చే ఆదాయాన్ని కోల్పోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. సమ్మె పరిష్కారానికి రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు ఇప్పటికీ రంగంలోకి దిగలేదు. రవాణామంత్రుల స్థాయిలోనే సమస్యను నాన్చుతున్నారు. జనానికి ఇబ్బందులు తెలిసిరావాలనే ఉద్దేశ్యంతో కావాలనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more