తెలంగాణ రాష్ట్రంలో అదనంగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలలోని లుకలుకలను బయటపెడుతున్నాయి. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఇంచార్జ్ దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు రాగా, ఇవాళ తెలంగాణ టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఒకే పార్టీలో వున్నా బద్ద శత్రువుల మాదిరిగా వుంటే వైరి వర్గానికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయడంతో.. నిజామాబాద్ జిల్లా టీడీపీలో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి.
తెలంగాణలో టీడీపీ పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్సీ సీటుకు అధినేత చంద్రబాబు వేం నరేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో.. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కినుకు వహించారు. అందుబాటులో ఉన్న తన అనుయాయువులు, అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో ఆయన త్వరలోనే టీడీపీ పార్టీని వీడే అలోచనలో వున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలందరూ టీడీపీని వీడినా.. తాను మాత్రం అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. అధికార టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పోరాటాన్ని అధినేత చంద్రబాబు గుర్తించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్న తనను కాదని, తనకు విరోధిగా మారిన వేం నరేందర్ రెడ్డికి పేరును అధినేత ప్రకటించడంపై ఆయన తన అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం. అయితే ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు కు కూడా తాను హాజరుకాకూడదని అరికెల నర్సారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more