cash for vote row : nt ramarao soul hurted once again

Cash for vote row senior ntr soul feels bad

senior ntr, nt ramarao, tdp party, tdp party updates, tdp party cash for vote row, tdp party wrong ways, tdp party illegals, chandrababu naidu, revanth reddy case, stephen news, senior ntr photos, chandrababu controversies, tdp party controversies

cash for vote row : nt ramarao soul hurted once again as his party going in wrong way

అన్నగారి ఆత్మ మళ్లీ క్షోభించివుంటుంది.

Posted: 06/02/2015 09:03 PM IST
Cash for vote row senior ntr soul feels bad

తెలుగు దేశం పార్టీ.. ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతుందంటే అందుకు కారణం పార్టీ వ్యవస్థాపకుడే. ఆయనే మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు. అప్పటి సమైక్య తెలుగు రాష్ట్రంలో ఓట హక్కు, దాని వినియోగం, గురించి తెలియని అనేక మందికి ఓటు విలువను తెలిపిన మహనీయుడు ఎన్టీయార్. అలాంటి ఎన్టీయార్ ఆత్మ ఇప్పటికెన్ని పర్యాయాలు క్షోభించివుంటుందో అర్థం చేసుకునే వారెవ్వరు. ఆయన జన్మదినాన.. ఎన్టీయార్ ఘాట్ వద్దకు చేరుకుని పుష్పగుచ్చాలు సమాధిపై పెట్టి శ్రధ్ధాంజలి ఘటించే కుటుంబ సభ్యులా..? లేక పార్టీ నేతలా..? లేక పార్టీ పగ్గాలను తీసుకుని.. అవినీతి మకిలి అంటించిన చంద్రబాబా..? ఎవరు స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మక్షోభను అర్థం చేసుకోగలరు..?

తెలుగు ప్రజల ఆత్మభిమానం ఢిల్లీ వీధుల్లో మోకరిల్లుతున్న సమయంలో కేవలం 9 నెలల సమయంలో పార్టీని ప్రకటించి అధికారాన్ని చేతబట్టిన రాజకీయ ధురంధురుడు ఎన్టీరామారావు. అధికారం చేతపట్టిన కోత్తలో అవినీతి అనేతి అదిపెద్ద జాడ్యం అని.. దానిని తొలగించేందుకు కూడా ఆయన చర్యలు చేపట్టారు ఆవినీతి ఎక్కడుందని తెలిసినా సహించేవాడు కాదాయన. ఆయన మంత్రివర్గంలోని ఓక అమాత్యుడి కూతరు వివాహానికి హాజరైన ఆయన.. వివాహానికి అమాత్యులు వెచ్చించి ఖర్చు చూసి ఆయనకు వెంటనే మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు. మంత్రిగా ఆయన అక్రమంగా డబ్బలు సంపాదించి.. వివాహంలో వెచ్చించారని అనుకున్నారామో గాని.. తన అమాత్యులని కూడా ఉపేక్షించకుండా అవినీతిపై అలా చర్యలు తీసుకున్నారు.

అంతేకాదు.. అవినీతి ఉందని అరోపణలు వచ్చిన వెంటనే తాను మారువేషంలో వెళ్లి అక్కడి బాధితుడి తరహాలో ఎన్టీయార్ పరిస్థితులను అనుభవించి చర్యలు తీసుకున్న ఘటనలు కూడా వున్నాయి. అయన నిజంగా చేసిన ఘటనలను కన్నడ హీరో అర్జున్ హారోగా వచ్చిన ఒకే ఒక్కడు చిత్రంలో జోడించారని చెప్పవచ్చు. అవినీతిపై అన్నగారిది అలుపెరగని పోరాటం. మరోలా చెప్పలాంటే.. అవినితిపై పోరులో అంధ్రప్రదేశ్ లో అన్నగారే అగ్రగన్యుడు. అలాంటి అన్నగారి అత్మ ఇప్పుడు క్షోభించివుంటుంది.

తన ఆశయాలను పక్కన బెట్టి.. పార్టీని ఇష్టానుసారంగా నడిపిన నేపథ్యంలోనే క్షోభించిన అన్నగారి. ఆత్మ.. పార్టీలో సముచిత స్థానం ఇస్తానని చెప్పి తోడల్లుడు దగ్గుబాటిని, పెద్ద బావమరిది హరికృష్ణకు మంత్రి పదవినిచ్చి..  ఆరు నెలల ముచ్చటగా మార్చిన తరుణంలో.. మధ్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంలో.. మతత్తత్వ శక్తులతో జతకట్టి అధికారాన్ని పంచుకున్న సందర్భంలో.. ఇలా అనేక పర్యాయాలు అన్నగారి ఆత్మ క్షోభించివుంటుంది. అయితే ఆ పర్యాయాలన్నీ వేరు.. ఇప్పడు అన్నగారి ఆత్మ క్షోభించడానికి కారణం వేరు. అవినీతి ఏ కోశాణ సహించని ఎన్టీయార్.. దానిపై వ్యతిరేకంగా, ఎక్కడా ఎలాంటి బంధుప్రీతికి అస్కారమివ్వకుండా చర్యలు తీసుకున్నారు.

అలాంటి అన్నాగారి పార్టీలోని వ్యక్తి, తమ బాస్ ఆదేశాల మేరకు  పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా మరో ఎమ్మెల్యేతో తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయాల్సిందిగా.. కోరుతూ ఐదు కోట్ల రూపాయలకు ఒప్పందం కుదర్చుకుని, అందులో అడ్వాన్స్ గా 50 లక్షల రూపాయలను తీసుకుని వెళ్లి ఇవ్వడం.. రెడ్ హ్యండెడ్ గా ఏసీబి అధికారులకు పట్టుబడటం అంతా జరిగిపోయాయి. దీంతో తాను అవినీతికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీలో అవినీతే రాజ్యమేలుతుందని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఎంతగా క్షోభించివుంటుందో..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : senior ntr  tdp party  chandrababu naidu  revanth reddy  

Other Articles