ఓటుకు నోటు వ్యవహారం టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీని, పార్టీ అధినేతను కాపాడే ప్రయత్నం చేస్తూన్నే.. తమ అధినేత తప్పు చేశారా..? అంటే అవుననే అంగీకారం ఇచ్చినట్లు చేయడమే ఇందుకు కారణమైంది. ఓటుకు నోటు కేసులో తమ అదినేత చంద్రబాబు.. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్లో మాట్లారని ప్రత్యక్షంగా అంగీకరించకుండానే.. పరోక్షంగా మాత్రం అయన చేసిన వ్యాఖ్యలు అలానే వున్నాయి.
ఎన్నికలలో డబ్బును ఖర్చు పెట్టడం పెద్ద తప్పుకాదంటూనే.. రాజకీయాల్లో పతివ్రతలు ఎవరు ఉన్నారని అడిగారు. డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికలలో గెలిచారా..? అంటూ నిలదీసి.. వితండవాదానికి తెరలేపారు. ఇంతవరకు బాగానే వున్నా.. జరుగుతున్నవి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు. అందునా.. అవి శాసనసభ్యుల కోటాలో జరుగుతున్న ఎన్నికలు. ఈ విషయాన్ని మరిచిన జూపూడి.. డబ్బు ఖర్చుపెట్టడం పెద్ద తప్పేం కాదు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే సాధారణ ఎన్నికలలో ఓటర్లను డబ్బుతో ప్రలో పెట్టడాన్ని సమర్థించకనే సమర్థించారు ఈ నేత.
అదీకాక. ఇప్పడు రాజకీయాలలో అంత ప్రతివ్రతలు ఎవరున్నారని వ్యాఖ్యానించడం కూడా మరో చర్చకు దారి తీసింది. టీడీపీ అధినేత చంద్రబాబే.. ఓటుకు నోటు కేసులో తనను తాను ఢిఫెన్స్ చేసుకునేందుకు ఇలా జూపూడితో మాట్లాడించారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అదీకాక. నిత్యం నితి, నిజాయితీ అంటూ ప్రసంగాలు ఇచ్చే తమ అధినేత చంద్రబాబు కూడా పతివ్రత కాదని జూపూడి ఉద్దేశ్యమా..? అంటూ మరికోందరు ప్రశ్నిస్తున్నారు. అంటే.. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఎదుర్కోంటున్న అభియోగాలు నిజమని జూపూడి నమ్ముతున్నారా..? అని కూడా మరికోందరు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఆయనే సమాధానం చెప్పాలి మరి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more