projects for ap.. party activities in telangana, telanganites to question nara lokesh

Telanganites to question nara lokesh projects for ap empty hands to telangana

projects for ap.. party activities in telangana, telanganites to question nara lokesh, Naralokesh, TDP, Telangana, AP, Telugudesamparty, Chandrababu naidu, US tour, barack Obama, villages adoption programme, industralists meet, lokesh meet barrack obama

Nara Lokesh said that he will avail a fortnight for telangana and another for andhrapradesh, where he can hear and resolve party cadre problems and issues, but telanganites questions nara lokesh, projects for ap.. empty hands to telangana

నారా లోకేష్ అందిరివాడు కాజాలడా..?

Posted: 07/02/2015 09:22 PM IST
Telanganites to question nara lokesh projects for ap empty hands to telangana

తెలుగు దేశం పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు.. అందరివాడు అవుతానని ఇవాళ విజయవాడలో తాజాగా ప్రకటించాడు. ఇక మీదట తెలంగాణ, ఏపిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. నెలలో పక్షం రోజుల పాటు తెలంగాణ కార్యకర్తలకు, మరో పక్షం రోజుల పాటు ఆంధ్రపదేశ్ లోని కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. అయితే నారా లోకేష్ బాబు అందరివాడు కాజాలడని రాజకీయ విశ్లేషకులతో పాటు విపక్షాలకు చెందిన పార్టీల నేతలు కూడా అప్పుడే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టు నెలకోల్పే విషయంలో నారా లోకేష్ చురుకుగా అమెరికా పర్యటన చేపట్టి.. దాదాపుగా ఒక వెయ్యికి పైగా ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలను ఎన్ ఆర్ ఐలు దత్తత తీసుకునేలా ఒప్పించి.. ఆ మేరకు ప్రభుత్వం తరపున కూడా పలు చర్యలు తీసుకున్నారు లోకేష్ బాబు. వీటినే అస్త్రంగా మలుచుకున్న తెలంగాణ అధికార పక్ష టీఆర్ఎస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టుల కోసం విదేశాలు తిరిగిన లోకేష్ బాబు.. తెలంగాణకు ఏం ఒరగబెట్టారని అందరి వాడు అవుతారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు కూడా వీటిని సమర్థవంతంగానే తిప్పికోడుతున్నారు

లోకేష్ బాబు.. ప్రభుత్వానికి ప్రతినిధిగా కాకుండా పార్టీ వ్యక్తిగా ఈ చర్యలు తీసుకున్నారని, రేపు తెలంగాణలోనూ అవసరమైతే ప్రాజెక్టులను తీసుకువస్తారని అంటున్నారు. ఇక తమ యువనేత ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రతినిధి అని చెప్పుకోస్తున్నారు. అందుకనే ఏపిలో ఉన్న కార్యకర్తలు కోసం ఇక మీద విజయవాడలో అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసారు. తెలంగాణ కార్యకర్తల కోసం హైదరాబాద్ పక్షం రోజులు వుంటారని చెబుతున్నారు.

దీనిని కూడా విపక్ష పార్టీల కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి ఆయన ఏ హోదాలో పరిశ్రమలు తీసుకోచ్చారని, అదే హోధాలో తెలంగాణకు ఎందుకు తీసుకురాలేరని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఆయన పార్టీ అధికారంలో వుంది కనుక అక్కడకు ప్రాజెక్టులు, తెలంగాణలో పార్టీ ప్రతిపక్షంలో వున్నందున ఇక్కడ కార్యకర్తలను కాపాడుకునే పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు చెప్పిన రెండు కళ్ల సిద్దాంతాన్ని బాగా వంట పట్టించుకున్న నారా లోకేష్ కూడా ఏపీ, తెలంగాణలపై పక్షపాతం వహిస్తూ అదే సిద్దాంతాన్ని ఫాలో కావడం సముచితం కాదంటున్నారు. అవునులే.. అవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా..? అన్న విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naralokesh  TDP  Telangana  AP  Telugu desam party  Chandrababu naidu  

Other Articles