ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అటకెక్కినట్టేనా అంటే అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు సాక్షిగా కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుపడదని తేల్చిచెప్పారు. అయితే అది తమ విషయంలో కాదని, రాష్ట్ర విభజనతో అర్థికంగా వెనకబడి సమస్యలలో కూరుకుపోయిన తమకు వర్తించదని చెబుతూ వచ్చిన నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీపై తమకు అచెంచలమైన నమ్మకం వుందని ఆయన తముక అన్యాయం చేయరని నమ్ముతున్నామని కేంద్రాన్ని వెనకేసుకోచ్చని టీడీపీ నేతల నమ్మకాలు నట్టేట్లో కలిశాయి.
తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా అవే సంకేతాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంచనాకు మించి సాయం చేస్తామన్న ఆయన.. ప్రత్యేక హోదాపై మాత్రం ఏలాంటి ప్రకటన చేయకపోవడం.. కేంద్రం చెప్పనకే చెప్పిందని, ఇక ప్రత్యేక హోదా హుళ్లక్కేనన్న భావన రాజకీయ విమర్శకులలో ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర పునర్విభజనతో అర్థికంగా సుడిగుండంలో చిక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదకుంటామని హామీ ఇచ్చిన జైట్లీ ప్రత్యేక హోదా మాత్రం ఒక్కమాట చెప్పక పోవడం దీనినే సూచిస్తుందంటున్నారు మేధావులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత సాయం అందించామని చెప్పిన జైట్లీ.. భవిష్యత్‌లో ఏపీకి అర్థిక తోడ్పాటు అందించడమే తమ ధ్యేయమన్నారు. ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని జైట్లీ పునరుద్ఘాటించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు కృషి చేస్తామని కానీ, కల్పిస్తామని కానీ చెప్పలేదు. నిధులిస్తే.. అభివృద్ది జరుగుతుందా..? పరిశ్రమలు వస్తే అభివృద్ది జరుగుతుందా.? భవనాలు రాజధాని నిర్మాణంలోనే ఏమీ జరగదని, అమరావతిలో ప్రజలు స్థిరనివాసాలు ఏర్పర్చుకుంటే తప్ప అన్న విషయాలను కేంద్రానికి విషదీకరించడంలో టీడీపీ విఫలమైందా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. అందుకనే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదాను మరుగున పడేసిందన్న వార్తలు వినబడుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more