దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి మాటలను కూడా కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే పెట్టబుడలోయ్ అన్న నినాదాన్ని పాటిస్తుంది. దేశం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టినా పర్వాలేదు కానీ.. విదేశీ పెట్టుబడిదారుల వ్యాపారాలకు మాత్రం ఏక్కడా ఎలాంట అవరోధం కలగకూడదని భావిస్తోంది. నిన్నమొన్నటి వరకు మ్యాగీ న్యూడుల్స్ విషయంలో యావత్ దేశం ఒక్కటై వాటిని నిషధిస్తే.. మళ్లీ దానిని ఎలా తీసుకువద్దామా..? అని కేంద్ర ప్రభత్వు యోచిస్తుంది కాబోలు. కేంద్రమంత్రి రాం విలాస్ ఫాశ్వాన్ వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపించక మానదు.
ప్రముఖ కంపెనీ నెస్లీ ఇండియా ఇన్‌స్టెంట్ నూడుల్స్ టాప్ బ్రాండ్ అయిన మ్యాగీలో రుచికి వినియోగించే రసాయనాలు లెడ్, మోనో సోడియం గ్లూటమేట్ అధిక మోతాదులో ఉన్నాయని, అవి వినియోగదారుల ఆరోగ్యంపై ఇవి ప్రభావం చూపుతున్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో పలు రాష్ట్రాల్లో మ్యాగీపై బ్యాన్ విధించారు. అయితే దేశ ప్రజల ఆరోగ్యంతో ఆటటాడుతున్న విదేశీ సంస్థలను కేంద్రం వత్తాసు పలుకుంతుంది. స్వయంగా సంబందిత కేంద్రమంత్రే మ్యాగీ మళ్లీ రిటైల్ షాపుల్లో కనిపిస్తుందని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆశాభావం వ్యక్తం చేయడం కూడా పలు ఆందోళనకు దారితీస్తుంది.
అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా నెస్టీలాంటి విషయాలకు సంబంధించి అనవసరంగా పెద్ద రభస చేయకూడదని, అన్ని నిజాలు వెలుగుచూసిన తరువాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అదేశించారని అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులు క్రమంగా సన్నగిల్లుతాయని, అలాంటి వాటిని తాము వ్యతిరేకమని ఆయన చెప్పుకోచ్చారని రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. అయితే తాజాగా తమ ఉత్పత్తులు తినేందుకు సురక్షితమేనని మ్యాగీ వాదిస్తున్న నేపథ్యంలో వాటిని భారత్ దుకాణాల్లో మళ్లీ పెట్టేందుకు కేంద్రం దోహదపడుతోంది.
ఈ మేరకు నిర్వహించిన తాజా పరిశోధనలు కూడా మ్యాగీ సేఫేనని చెబుతున్నాయి. మ్యాగీ మళ్లీ రిటైల్ షాపుల్లో కనిపిస్తుందని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోవా ఆహార భద్రతా శాఖ నుంచి వచ్చిన మ్యాగీ శాంపిల్స్‌ను మైసూర్ ల్యాబ్‌లో పరీక్షించి ధృవీకరించారు. దీంతో రిటైల్ షాపుల్లోని ర్యాకులు మళ్ళీ మ్యాగీతో నిండుతాయని అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. అయితే ఇక్కడే అనుమానాలు తావుందని పలువురు అంటున్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో కాకుండా.. మ్యాగీ సమస్య ఉత్ఫన్నమైన ఉత్తర్ ప్రదేశ్ ల్యాబ్ లలో మ్యాగీని పరీక్షించి క్లీన్ చిట్ తీసుకున్న తరువాతే దానిని దేశంలోకి అనుమంతించాలని పలువురు పౌర అహార భద్రతా నిపుణులు అంటున్నారు
ఇప్పటికైతే.. కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ కూడా మ్యాగీ సేఫేనని సర్టిఫై చేసినా.. జూన్ 5న విధించిన నిషేధంపై ఇంకా ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రీయ ఆహార భద్రతా పరిమాణాల సంస్థ ప్రకటించింది. ప్రపంచంలోకెళ్లా అత్యంత పెద్ద మార్కెట్లు వున్న దేశాలలో భారత్ ఒక్కటి. ఈ దేశంలో తమ ఉత్పాదనలు విక్రయించేందుకు అన్ని పరిశ్రమలు పోటీ పడుతుంటాయి. అయితే ప్రజారోగ్యంతో ఆటలు ఆడితే మాత్రం బేషరుతుగా నిషేధాన్ని విధిస్తామని తేల్చిచెప్పాల్సిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులు వెనుకంజ వేస్తారన్న దిశగా ఆలోచించడం ఎంతవరకు సబబో కేంద్రానికే తెలియాలి. ప్రజారోగ్యం మాటున విక్రయాలు జరిపితే.. అది దేశాభివృద్ది ఎలా అవుతుందో ప్రభుత్వాలు పునరాలోచించాలి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more