ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన పోరుసభలో మునికోటి అనే యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించిన అంశం చర్చనీయంశంగా మారుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యాలను తమ పార్టీలో అమలుపరుస్తారా..? లేక కేవలం విమర్శలకే పరిమితం అవుతారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. తిరుపతిలో యువకుడి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమన్న ఆయన.. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో విపక్షాలు ఆయనపై ప్రశ్నలను కురిపించేందుకు సిద్దమవుతున్నాయి.
ఏపీ పిసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పనికిరారని తిరుపతి ఘటన రుజువు చేస్తుందని, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం దీనిని స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే విపక్షాలు కూడా అదే స్థాయిలో ప్రశ్నలను సంధించడానికి సిద్దమవుతున్నాయి. నాగార్జునా విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు.. టీడీపీ అధినేత, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి ఘటనకు భాద్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన పోమిరెడ్డి రాజమండ్రిలో తోక్కిసలాట ఘటనలో 36 మంది మరణానికి కారణమైన చంద్రబాబును ముందుగా రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more